ఈ కథలన్నీ అత్యుత్తమ శ్రేణికి చెందినవని చెప్పడం అత్యుక్తి అవుతుంది కానీ, ప్రతి కథా, రచయిత నిశిత పరిశీలనా దృష్టికి, బలీయమైన కథన ధోరణికీ దృష్టాంతాలే. ఈ కథా శ్రేణిలో 'సాదృశ్యం' లో ఒక తండ్రి సగటు తెలివిగలవాడైన తన కుమారుని ఇతరులతో పోలుస్తూ తక్కువ అంచనా వేసి, ఆ కొడుకే ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు పొందిన ఆనందాన్ని చిత్రీకరించారు. ఈ అరుదైన అంశం, 'స్వప్నం' కథలో రచననే జీవితంలో వృత్తిగా భావించి విజయం సాధించిన వ్యక్తి ఉదంతంలో చిత్రీకరించబడింది. 'మునుస్వామి' కథలో భూమిని నమ్ముకున్న మునుస్వామి చెట్లూ, చేమల్ని ఎంతగా ప్రేమించాడో ఆర్ద్రమైన రీతిలో చెప్పబడింది. మరికొన్ని కథలలో మానవుల మధ్య ప్రేమానురాగాలు చిత్రించబడ్డాయి. మొత్తం మీద కథలనిండా మానవత్వపు సువాసన నిండి ఉంది పాఠకుల మనసులకు ఆహ్లాదం కలిగిస్తుంది. వయస్సులో పెద్దని కాబట్టి ఈ చిరంజీవిని తన చుట్టూ ఉన్న మానవ జీవితాన్ని మరింత గాఢంగా పరిశీలించి, మరిన్ని మంచి కథలు వెలయించి పాఠకలోకం చేత గుర్తింపబడాలని ఆశీర్వదిస్తున్నాను.
- పెద్దిబొట్ల సుబ్బరామయ్య
ఈ కథలన్నీ అత్యుత్తమ శ్రేణికి చెందినవని చెప్పడం అత్యుక్తి అవుతుంది కానీ, ప్రతి కథా, రచయిత నిశిత పరిశీలనా దృష్టికి, బలీయమైన కథన ధోరణికీ దృష్టాంతాలే. ఈ కథా శ్రేణిలో 'సాదృశ్యం' లో ఒక తండ్రి సగటు తెలివిగలవాడైన తన కుమారుని ఇతరులతో పోలుస్తూ తక్కువ అంచనా వేసి, ఆ కొడుకే ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు పొందిన ఆనందాన్ని చిత్రీకరించారు. ఈ అరుదైన అంశం, 'స్వప్నం' కథలో రచననే జీవితంలో వృత్తిగా భావించి విజయం సాధించిన వ్యక్తి ఉదంతంలో చిత్రీకరించబడింది. 'మునుస్వామి' కథలో భూమిని నమ్ముకున్న మునుస్వామి చెట్లూ, చేమల్ని ఎంతగా ప్రేమించాడో ఆర్ద్రమైన రీతిలో చెప్పబడింది. మరికొన్ని కథలలో మానవుల మధ్య ప్రేమానురాగాలు చిత్రించబడ్డాయి. మొత్తం మీద కథలనిండా మానవత్వపు సువాసన నిండి ఉంది పాఠకుల మనసులకు ఆహ్లాదం కలిగిస్తుంది. వయస్సులో పెద్దని కాబట్టి ఈ చిరంజీవిని తన చుట్టూ ఉన్న మానవ జీవితాన్ని మరింత గాఢంగా పరిశీలించి, మరిన్ని మంచి కథలు వెలయించి పాఠకలోకం చేత గుర్తింపబడాలని ఆశీర్వదిస్తున్నాను. - పెద్దిబొట్ల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.