మారుతున్న పరిస్థితులను బట్టి మనం కొత్త ఆలోచనలకు సానపట్టాలి. రచయితల సహకార పద్దతిలో 'మా కథల వార్షిక సంకలనాలు ప్రచురించి పాఠకులకు చౌక ధరలో పుస్తకం అందజేయడం వినూత్నమైన ఆలోచనే.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువైనప్పుడు సాహితీప్రియులు రచయితలకు బహుమతులు యిచ్చి ఉత్సాహపరచాలి. తెలుగు పుస్తకానికి చేయూతనివ్వాలి. అందుకే నచ్చిన కథకు బహుమతి ఇవ్వండి.
కొందరు సాహితీప్రియులు, తనకు రచయితలను ప్రోత్సహించడానికి అవార్డులు, బహుమతులు ఇవ్వాలనే ఆలోచన వుందని, అది కార్యరూపంలోకి ఎలా తీసుకురావాలో తెలియడంలేదని వాపోతున్నారు. ఇప్పుడు మీ సంస్థ ద్వారా అవార్డు, వ్యక్తిగతంగా బహుమతి అయినా 'నాకు నచ్చిన కథ' అని మీరు రచయితలకు ఇవ్వొచ్చు.
కథలన్నీ నిజసంఘటనలు కాకపోవచ్చును. కథలో కొంత నిజం, కొంత కల్పితం వుండి పాఠకుడిని ఆకట్టుకోవడంలోనే రచయిత నైపుణ్యం తెలుస్తుంది. మీరు చదువుతున్న కథలో మీరు వుండి, మీ బంధుమిత్రులు సమాజము కనిపిస్తూ, చాలాకాలం గుర్తుండి పోయేలా వున్నా కథ ఏదోకటి తప్పక వుంటుంది.
- సి. హెచ్. శివరామ ప్రసాద్