గుండె చెరువై...
-ఎమ్వీ రామిరెడ్డి
9866777870
ఆ మధ్యాహ్నం మరగ్గాగిన పొంతకాగులా ఉంది. ఆవిర్లు పోతున్న అట్లపెనంలా
ఆషాఢమాసానికి ఆహ్వానం పలికేముందు జ్యేష్ఠం ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఊరు ఊరంతా దాహంతో అల్లాడిపోతోంది. నాలుగు మైళ్లు నడిచి, బిందెడు నీటిని నెత్తిన పెట్టుకుని వచ్చేసరికి నరాలు చచ్చుబడిపోతున్నాయి. ముసలీ ముతకా పిట్టల్లా రాలిపోతున్నారు.
సంవత్సరం గుర్తే, 1826. నగరానికి నలభై క్రోసుల దూరానున్న ఈ కుగ్రామంపై మొఘలాయిల కరుణ కురిసే అవకాశం లేని దుర్భరకాలం.
అంటే, దాదాపు రెండు శతాబ్దాల కిందట, సిద్ధప్ప తలపాగా చుట్టి ఇక్కడ తొలి పలుగుదెబ్బ వేశాడు. ఊరిజనం పోగై, అతన్ని పిచ్చోడిలా చూశారు.
"సస్తారా? గుక్కెడు నీళ్లులేవని గుంపులు గుంపులుగా కాటికి బోతారా? వారం పదిరోజుల్లో వానలు మొదలవుతయి. సిన్న కుంటయినా తవ్వుకుంటే, కనీసం వానాకాలమైనా నీటియాతన ఉండదు. సుతారం సూట్టం మానేసి, పలుగుపారా పట్టండి" ఆజ్ఞాపించినట్లే చెప్పాడు సిద్ధప్ప.
ఒక్కొక్కరే పోగయ్యారు. కుర్రాళ్లు పలుగుల్తో తవ్వుతుంటే, మీసాలు మెరిసినోళ్లు పారల్తో ఎత్తుతుంటే, ఆడాళ్లు మట్టిని తట్టలతో దరులకు తరలించారు. పనిలో అలసిపోయినవారికి పిల్లోళ్లు సత్తుగ్లాసులతో మంచినీళ్లందించారు.
ఎర్రటి ఎండల్ని లెక్క చెయ్యకుండా తవ్వుతూనే ఉన్నారు. వారం గడిచింది. పెద్ద కుంట తయారైంది. పదకొండో రోజు మబ్బులు గర్జించాయి. మెల్లగా మొదలైన చినుకులు చూస్తుండగానే ఉధృతరూపం దాల్చాయి. పనిముట్లు పక్కన పడేసి, అందరూ జానపదగీతాలు పాడుతూ నృత్యం చేశారు. వానలో తడిసి ముద్దయ్యారు.
ఎడతెరిపి లేకుండా వారంపాటు కురిసిన వానలకు ఆ కుంట నిండింది. సిద్ధప్ప సంకల్పం ఫలించింది. ఊరి దాహం తీరింది. మరుసటి ఏడాది మరింత తవ్వారు.
అలా ఆ జనసమూహం మూణ్నాలుగేళ్లపాటు చిందించిన స్వేదం ఫలితంగా నేను పుట్టాను. కట్టెదుట ప్రత్యక్షమైన నీటిభాండాగారాన్ని చూసి జనం మురిసిపోయారు. 'సిద్ధప్ప చెరువు' అని నాకు నామకరణం చేశారు.............
గుండె చెరువై... -ఎమ్వీ రామిరెడ్డి 9866777870 ఆ మధ్యాహ్నం మరగ్గాగిన పొంతకాగులా ఉంది. ఆవిర్లు పోతున్న అట్లపెనంలా ఆషాఢమాసానికి ఆహ్వానం పలికేముందు జ్యేష్ఠం ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఊరు ఊరంతా దాహంతో అల్లాడిపోతోంది. నాలుగు మైళ్లు నడిచి, బిందెడు నీటిని నెత్తిన పెట్టుకుని వచ్చేసరికి నరాలు చచ్చుబడిపోతున్నాయి. ముసలీ ముతకా పిట్టల్లా రాలిపోతున్నారు. సంవత్సరం గుర్తే, 1826. నగరానికి నలభై క్రోసుల దూరానున్న ఈ కుగ్రామంపై మొఘలాయిల కరుణ కురిసే అవకాశం లేని దుర్భరకాలం. అంటే, దాదాపు రెండు శతాబ్దాల కిందట, సిద్ధప్ప తలపాగా చుట్టి ఇక్కడ తొలి పలుగుదెబ్బ వేశాడు. ఊరిజనం పోగై, అతన్ని పిచ్చోడిలా చూశారు. "సస్తారా? గుక్కెడు నీళ్లులేవని గుంపులు గుంపులుగా కాటికి బోతారా? వారం పదిరోజుల్లో వానలు మొదలవుతయి. సిన్న కుంటయినా తవ్వుకుంటే, కనీసం వానాకాలమైనా నీటియాతన ఉండదు. సుతారం సూట్టం మానేసి, పలుగుపారా పట్టండి" ఆజ్ఞాపించినట్లే చెప్పాడు సిద్ధప్ప. ఒక్కొక్కరే పోగయ్యారు. కుర్రాళ్లు పలుగుల్తో తవ్వుతుంటే, మీసాలు మెరిసినోళ్లు పారల్తో ఎత్తుతుంటే, ఆడాళ్లు మట్టిని తట్టలతో దరులకు తరలించారు. పనిలో అలసిపోయినవారికి పిల్లోళ్లు సత్తుగ్లాసులతో మంచినీళ్లందించారు. ఎర్రటి ఎండల్ని లెక్క చెయ్యకుండా తవ్వుతూనే ఉన్నారు. వారం గడిచింది. పెద్ద కుంట తయారైంది. పదకొండో రోజు మబ్బులు గర్జించాయి. మెల్లగా మొదలైన చినుకులు చూస్తుండగానే ఉధృతరూపం దాల్చాయి. పనిముట్లు పక్కన పడేసి, అందరూ జానపదగీతాలు పాడుతూ నృత్యం చేశారు. వానలో తడిసి ముద్దయ్యారు. ఎడతెరిపి లేకుండా వారంపాటు కురిసిన వానలకు ఆ కుంట నిండింది. సిద్ధప్ప సంకల్పం ఫలించింది. ఊరి దాహం తీరింది. మరుసటి ఏడాది మరింత తవ్వారు. అలా ఆ జనసమూహం మూణ్నాలుగేళ్లపాటు చిందించిన స్వేదం ఫలితంగా నేను పుట్టాను. కట్టెదుట ప్రత్యక్షమైన నీటిభాండాగారాన్ని చూసి జనం మురిసిపోయారు. 'సిద్ధప్ప చెరువు' అని నాకు నామకరణం చేశారు.............© 2017,www.logili.com All Rights Reserved.