కథాకృష్ణం
కృష్ణార్చనం
కీర్తిశేషులు అంగర వెంకట కృష్ణారావుగారి శతజయంతి వేడుక, ఆ సందర్భంగా ప్రముఖరచయిత, కృష్ణారావుగారి అభిమాన పాత్రులు, శ్రీ శివల జగన్నాధరావుగారికి "అంగర వెంకట కృష్ణారావు శతజయంతి సాహితీ పురస్కారం" అక్షరాలా లక్ష రూపాయలు బహూకరించడం సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సౌజన్యంతో తేదీ 22-10-2020 న "విశాఖ సాహితి" సముచితంగా నిర్వహించింది.
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, “నాన్న గారి కథలు, దొరికినన్ని, పుస్తకంగా తీసుకువద్దాం. ఆర్థికం మా బాధ్యత. మిగతా పని అంతా మీ బాధ్యత" అన్నారు. కృష్ణారావుగారి అమ్మాయి రమణిగారు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు తరఫునా. తత్ఫలితమే మీ చేతుల్లో ఉన్న "కథాకృష్ణం"
కృష్ణారావుగారికి కీర్తికాంక్ష లేశమూ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. వారు తమ రచనలేవీ భద్రపరచకపోవడానికి ఇదే కారణం. గతంలో “విశాఖ సాహితి" కృష్ణారావుగారి కథల సంకలనం "కదిలే బొమ్మలు" ప్రచురించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందే ఇప్పుడూ పునరావృతమైంది.
కొన్ని మొదటి, చివరి పుటలు లేని “కదిలే బొమ్మలు" పుస్తకం మాత్రమే శ్రీమతి | రమణిగారి వద్ద ఉంది. అందువలన కథల సంపాదనే పెద్ద పనయింది. ఫలితం మాత్రం బహుపరిమితం.
కథల సేకరణకై సంప్రదించిన వారంతా వెంటనే, లేదా తమ వీలు వెంటనే స్పందించారు. కానీ, చాలామంది దగ్గర కృష్ణారావుగారి రచనలు అలభ్యం. |
కృష్ణారావుగారి మిత్రులు, విశిష్టకథకులు, కీర్తిశేషులు కాళీపట్నం రామారావు | గారు స్థాపించిన “కథానిలయ"మే మాకూ వరప్రదాయిని అయింది. ఈ సంకలనంలోని అధిక భాగం "కథానిలయం" వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నవీ, "కదిలే బొమ్మలు" | పుస్తకం నుండి తీసుకున్నవే.
మావద్ద గల "కదిలే బొమ్మలు" ప్రతిలో లేని మొదటి, చివరి పుటల ఫోటోలు | కూడా మాకు చేరడం, "కథానిలయం" ప్రతి నుండి, అదిగిన తక్షణమే, వాటిని వాట్సాప్ | చేసిన, ప్రస్తుతం “కథానిలయం" వ్యవహారాలు చూస్తున్న, కారా మాష్టారి కుమారుడు |.........................
కథాకృష్ణం కృష్ణార్చనం కీర్తిశేషులు అంగర వెంకట కృష్ణారావుగారి శతజయంతి వేడుక, ఆ సందర్భంగా ప్రముఖరచయిత, కృష్ణారావుగారి అభిమాన పాత్రులు, శ్రీ శివల జగన్నాధరావుగారికి "అంగర వెంకట కృష్ణారావు శతజయంతి సాహితీ పురస్కారం" అక్షరాలా లక్ష రూపాయలు బహూకరించడం సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సౌజన్యంతో తేదీ 22-10-2020 న "విశాఖ సాహితి" సముచితంగా నిర్వహించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, “నాన్న గారి కథలు, దొరికినన్ని, పుస్తకంగా తీసుకువద్దాం. ఆర్థికం మా బాధ్యత. మిగతా పని అంతా మీ బాధ్యత" అన్నారు. కృష్ణారావుగారి అమ్మాయి రమణిగారు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు తరఫునా. తత్ఫలితమే మీ చేతుల్లో ఉన్న "కథాకృష్ణం" కృష్ణారావుగారికి కీర్తికాంక్ష లేశమూ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. వారు తమ రచనలేవీ భద్రపరచకపోవడానికి ఇదే కారణం. గతంలో “విశాఖ సాహితి" కృష్ణారావుగారి కథల సంకలనం "కదిలే బొమ్మలు" ప్రచురించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందే ఇప్పుడూ పునరావృతమైంది. కొన్ని మొదటి, చివరి పుటలు లేని “కదిలే బొమ్మలు" పుస్తకం మాత్రమే శ్రీమతి | రమణిగారి వద్ద ఉంది. అందువలన కథల సంపాదనే పెద్ద పనయింది. ఫలితం మాత్రం బహుపరిమితం. కథల సేకరణకై సంప్రదించిన వారంతా వెంటనే, లేదా తమ వీలు వెంటనే స్పందించారు. కానీ, చాలామంది దగ్గర కృష్ణారావుగారి రచనలు అలభ్యం. | కృష్ణారావుగారి మిత్రులు, విశిష్టకథకులు, కీర్తిశేషులు కాళీపట్నం రామారావు | గారు స్థాపించిన “కథానిలయ"మే మాకూ వరప్రదాయిని అయింది. ఈ సంకలనంలోని అధిక భాగం "కథానిలయం" వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నవీ, "కదిలే బొమ్మలు" | పుస్తకం నుండి తీసుకున్నవే. మావద్ద గల "కదిలే బొమ్మలు" ప్రతిలో లేని మొదటి, చివరి పుటల ఫోటోలు | కూడా మాకు చేరడం, "కథానిలయం" ప్రతి నుండి, అదిగిన తక్షణమే, వాటిని వాట్సాప్ | చేసిన, ప్రస్తుతం “కథానిలయం" వ్యవహారాలు చూస్తున్న, కారా మాష్టారి కుమారుడు |.........................© 2017,www.logili.com All Rights Reserved.