మామిడి పళ్ళు
మునీ కరీం బఖ్.. జిల్లా కోర్టులో చాలా కాలం క్లర్కుగా పనిచేసి రిటైరయ్యాడు. ఇపుడు అతనికి 65 ఏళ్ళు పైనే ఉంటాయి. వయసు మీద పడుతున్నా చూడ్డానికి ఎపుడూ చలాకీగా, కుర్రాడిగానే కనిపిస్తాడు. ఎదుటివారితో నిదానంగా, జాగ్రత్తగా మాట్లాడతాడు. అందరితో మర్యాదగా ఉంటాడు. తోటివారికి చేతనైనంత సాయం చేయాలనుకుంటాడు. బంగారానికి తావి అబ్బినట్టు ఎంతో నిజాయితీపరుడు. నిజానికి కరీం బల్ష్ ఈ సుగుణాలన్నీ నిండుగా పోతపోసిన ఒక మంచి మనిషి అని చెప్పొచ్చు.
డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు పనిచేసినందుకు కరీంకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది. నెల మొదటివారంలో అతను పెన్షన్ తీసుకోవడానికి ట్రెజరీ ఆఫీసుకి వెళ్తాడు. ట్రెజరీ ఆఫీసులో బంట్రోతు నుంచి పెద్ద సారు దాకా అతనికి అందరితో మంచి పరిచయాలున్నాయి. ఈ సంగతి అక్కడి క్లర్కులందరికీ బాగా తెలుసు. అందుకే వారంతా అతన్ని ఎంతో గౌరవిస్తారు. కాగితాలపై సంతకాలు పెట్టి ఇవ్వడం... పెన్షన్ తీసుకోవడం చకచక జరిగిపోతుంది. గవర్నమెంటు ఆఫీసులో నిమిషాల్లో పనవ్వడానికి కారణం అక్కడ అతనికున్న హవాయే!
ప్రతి నెల అతను పది రూపాయల ఐదు నోట్లు తీసుకుంటాడు. పెద్ద వయసు కారణంగా వణుకుతున్న చేతులతో అ డబ్బుల్ని తన పాత కాలంనాటి పొడుగాటి కోటు లోపల పాకెట్లో జాగ్రత్తగా దాచుకుంటాడు. కళ్ళ జోడు పైనుంచి క్యాషియర్ వేపు చూస్తూ కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్తాడు. 'ఒకవేళ బతికి బాగుంటే వచ్చే నెల మొదట్లో మళ్ళీ నమస్కారం పెట్టేందుకు వస్తాను' అని వినయంగా చెప్పి పెద్ద సారు చాంబరేపు వెళతాడు. ఎనిమిదేళ్లుగా అతనిది ఇదే పద్ధతి.
అతని అసలు పేరు కరీం బక్ష్, అయితే ఏళ్ళ తరబడి మునీ(రికార్డ్ కీపర్)గా పనిచేయడంతో మునీ కరీం బఖ్ అయ్యాడు. అతను అల్ప సంతోషి, చిన్న కోరికలు తీరితే చాలనుకుంటాడు. ఈ విషయం ట్రెజరీ ఆఫీసులో దాదాపు ప్రతి క్లర్కుకీ....................
మామిడి పళ్ళు మునీ కరీం బఖ్.. జిల్లా కోర్టులో చాలా కాలం క్లర్కుగా పనిచేసి రిటైరయ్యాడు. ఇపుడు అతనికి 65 ఏళ్ళు పైనే ఉంటాయి. వయసు మీద పడుతున్నా చూడ్డానికి ఎపుడూ చలాకీగా, కుర్రాడిగానే కనిపిస్తాడు. ఎదుటివారితో నిదానంగా, జాగ్రత్తగా మాట్లాడతాడు. అందరితో మర్యాదగా ఉంటాడు. తోటివారికి చేతనైనంత సాయం చేయాలనుకుంటాడు. బంగారానికి తావి అబ్బినట్టు ఎంతో నిజాయితీపరుడు. నిజానికి కరీం బల్ష్ ఈ సుగుణాలన్నీ నిండుగా పోతపోసిన ఒక మంచి మనిషి అని చెప్పొచ్చు. డిపార్ట్మెంట్లో 30 ఏళ్ళు పనిచేసినందుకు కరీంకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది. నెల మొదటివారంలో అతను పెన్షన్ తీసుకోవడానికి ట్రెజరీ ఆఫీసుకి వెళ్తాడు. ట్రెజరీ ఆఫీసులో బంట్రోతు నుంచి పెద్ద సారు దాకా అతనికి అందరితో మంచి పరిచయాలున్నాయి. ఈ సంగతి అక్కడి క్లర్కులందరికీ బాగా తెలుసు. అందుకే వారంతా అతన్ని ఎంతో గౌరవిస్తారు. కాగితాలపై సంతకాలు పెట్టి ఇవ్వడం... పెన్షన్ తీసుకోవడం చకచక జరిగిపోతుంది. గవర్నమెంటు ఆఫీసులో నిమిషాల్లో పనవ్వడానికి కారణం అక్కడ అతనికున్న హవాయే! ప్రతి నెల అతను పది రూపాయల ఐదు నోట్లు తీసుకుంటాడు. పెద్ద వయసు కారణంగా వణుకుతున్న చేతులతో అ డబ్బుల్ని తన పాత కాలంనాటి పొడుగాటి కోటు లోపల పాకెట్లో జాగ్రత్తగా దాచుకుంటాడు. కళ్ళ జోడు పైనుంచి క్యాషియర్ వేపు చూస్తూ కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్తాడు. 'ఒకవేళ బతికి బాగుంటే వచ్చే నెల మొదట్లో మళ్ళీ నమస్కారం పెట్టేందుకు వస్తాను' అని వినయంగా చెప్పి పెద్ద సారు చాంబరేపు వెళతాడు. ఎనిమిదేళ్లుగా అతనిది ఇదే పద్ధతి. అతని అసలు పేరు కరీం బక్ష్, అయితే ఏళ్ళ తరబడి మునీ(రికార్డ్ కీపర్)గా పనిచేయడంతో మునీ కరీం బఖ్ అయ్యాడు. అతను అల్ప సంతోషి, చిన్న కోరికలు తీరితే చాలనుకుంటాడు. ఈ విషయం ట్రెజరీ ఆఫీసులో దాదాపు ప్రతి క్లర్కుకీ....................© 2017,www.logili.com All Rights Reserved.