పుష్ప విలాపం
'అగ్గిపుల్లతో దీపం వెలిగించుకుని ఇంటిని చక్కబెట్టుకున్నాక దాన్ని బయట పారేస్తాం!'
అది 'ఫూల్ మహల్' షాపు. దాని గద్దెపై కూచున్న యాజమాని సుగంధీలాల్ తన అనుభవాలన్నీ చెపుతూ, వ్యాపార కిటుకులన్నీ నాకు నేర్పుతున్నాడు.
దండలో పూలు గుచ్చినట్లుగా అతను మాటల మధ్యలో కామెడీ చేస్తూ, జోకులు పేలుస్తూ తన దగ్గరకొచ్చే అమాయక కస్టమర్లను బుట్టలో పడేస్తుంటాడు.
'దండ నచ్చిందని కస్టమరు అనగానే అది వాళ్లకిచ్చి వెంటనే డబ్బు తీసుకోవాలి.
సుగంధీలాల్ చెప్పడం ఆపి, పెద్దగా నవ్వుతున్నాడు. నేను కూడా అతనితో కలిసి కోరస్గా నవ్వాలన్నట్టు నావేపు చూశాడు.
అతని మాటల్లో పడ్డ నాకు సూది గుచ్చుకుంది.
సుగంధీలాల్కు తన గద్దెపై కులాసాగా కూచుని కస్టమర్లకు పూలదండలు అమ్ముతూ, ఆ నోట్లన్నీ లెక్కబెట్టుకోవడంతోనే రోజంతా గడిచిపోతుంది. కస్టమర్లతో జన్మజన్మల బంధముందన్నట్లుగా తీయతీయని మాటలు చెబుతూ ధందా చేస్తుంటాడు. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. 'ఫూల్ మహల్'కు మార్కెట్లో బోలెడంత డిమాండు. కొత్త కొత్త కోర్కెలతో, డిమాండ్లతో కస్టమర్లు రావడంతో షాప్ దగ్గర ఇసుకేస్తే రాలనంత తాకిడి. వాళ్లకు త్వరగా దండలు కట్టి ఇవ్వమని సుగంధీలాల్ గట్టిగా అరుస్తుంటాడు. మాటిమాటికి 'రాజూ... రాజీ... ఎదవల్లారా జల్ది దండలు కట్టి ఇవ్వండి' అని వాళ్లని తిడుతుంటాడు.
మా షాపును దూరం నుంచి చూస్తే కస్టమర్లను ఇట్టే ఆకర్షించేలా 'ఫూల్ మహల్' సైన్బోర్డుని మిరుమిట్లుగొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాం..................
పుష్ప విలాపం 'అగ్గిపుల్లతో దీపం వెలిగించుకుని ఇంటిని చక్కబెట్టుకున్నాక దాన్ని బయట పారేస్తాం!' అది 'ఫూల్ మహల్' షాపు. దాని గద్దెపై కూచున్న యాజమాని సుగంధీలాల్ తన అనుభవాలన్నీ చెపుతూ, వ్యాపార కిటుకులన్నీ నాకు నేర్పుతున్నాడు. దండలో పూలు గుచ్చినట్లుగా అతను మాటల మధ్యలో కామెడీ చేస్తూ, జోకులు పేలుస్తూ తన దగ్గరకొచ్చే అమాయక కస్టమర్లను బుట్టలో పడేస్తుంటాడు. 'దండ నచ్చిందని కస్టమరు అనగానే అది వాళ్లకిచ్చి వెంటనే డబ్బు తీసుకోవాలి. సుగంధీలాల్ చెప్పడం ఆపి, పెద్దగా నవ్వుతున్నాడు. నేను కూడా అతనితో కలిసి కోరస్గా నవ్వాలన్నట్టు నావేపు చూశాడు. అతని మాటల్లో పడ్డ నాకు సూది గుచ్చుకుంది. సుగంధీలాల్కు తన గద్దెపై కులాసాగా కూచుని కస్టమర్లకు పూలదండలు అమ్ముతూ, ఆ నోట్లన్నీ లెక్కబెట్టుకోవడంతోనే రోజంతా గడిచిపోతుంది. కస్టమర్లతో జన్మజన్మల బంధముందన్నట్లుగా తీయతీయని మాటలు చెబుతూ ధందా చేస్తుంటాడు. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. 'ఫూల్ మహల్'కు మార్కెట్లో బోలెడంత డిమాండు. కొత్త కొత్త కోర్కెలతో, డిమాండ్లతో కస్టమర్లు రావడంతో షాప్ దగ్గర ఇసుకేస్తే రాలనంత తాకిడి. వాళ్లకు త్వరగా దండలు కట్టి ఇవ్వమని సుగంధీలాల్ గట్టిగా అరుస్తుంటాడు. మాటిమాటికి 'రాజూ... రాజీ... ఎదవల్లారా జల్ది దండలు కట్టి ఇవ్వండి' అని వాళ్లని తిడుతుంటాడు. మా షాపును దూరం నుంచి చూస్తే కస్టమర్లను ఇట్టే ఆకర్షించేలా 'ఫూల్ మహల్' సైన్బోర్డుని మిరుమిట్లుగొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాం..................© 2017,www.logili.com All Rights Reserved.