కాశీ నగరానికి పడమర దిశలో మూడు నూర్ల ఆమడల దూరంలో భూచక్రపురం అనే ఒక పట్టణం వుంది. సూర్యవంశానికి చెందిన నవభోజరాజు భూచక్రపురాన్ని మహావైభవంగా పరిపాలిస్తున్నాడు. అయన పాలనలో ప్రజలకు ఎలాంటి చీకూ చింతలేదు. హాయిగా జీవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు.
నవభోజరాజు పట్టమహిషి భూలక్ష్మీదేవి. పేరుకు తగ్గట్టుగానే ఆమె వంటి గుణవంతురాలు సౌశీల్యరాశి మరొకరు కానరారు. అనుక్షణం ప్రభువు క్షేమం ప్రజల మంచి చెడులు విచారించే మహాపతిప్రతాశిరోమణి ఆమె.
అంతటి సుగుణాలరాశికి ఒక్కటే చింత సంతాన భాగ్యం లేకపోవడంతో ఆ రాజా దంపతులు నోచని నోములేదు. చేయని వ్రతం లేదు. ఎన్నో తీర్థయాత్రలు చేసి ఎన్నో క్షేత్రాలను భక్తి ప్రవత్తులతో సేవించారు. లెక్కకు మిక్కిలి దాన ధర్మాలు చేశారు.
మరెన్నో నాగ ప్రతిష్ఠలు చేశారు. భ్రమ్మణ బాలురకి ఉపనయనాలు చేయించి వివాహాది శుభకార్యాలు జరిపించారు. మంచి నీటి చలివేంద్రాలు పెట్టించి, అన్న సత్రాలు కట్టించారు. నిత్యాన్న సమారాధనలు చేయిస్తున్న కూడా వారికీ సంతానం కలగలేదు
- ఎన్. ఎస్. నాగిరెడ్డి