కుక్కలను పెంచినవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయవి. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో ఉన్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు. ఒకసారి నేర్పించామంటే ప్రాణాలకు తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్కుండేది. ఆయనకి కాస్త తిక్క కొండల్లో, రెండు శిఖరాల మధ్య ఓ హెయిర్ పిన్ బెండ్ లో కట్టుకున్నాడు ఇల్లు. ఆ ఒంటరి మనిషికి కుక్క తోడూ. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నప్పుడు కింద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ఆయన ఎర్రజెండా ఊపి సైగ చేసేవాడు. అది సంకేతంగా, ఘాట్ రోడ్డు మీద వాహనాల రాకపోకల్ని నియంత్రించే వాళ్ళు.
ఒకనాడు కింద, ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు రాళ్ళు పడటం ప్రారంభమైంది. మొదట తాతగారి తలమీద రాయిపడటంతో ఆయన స్పృహ కోల్పోయాడు. అంతే. కుక్క తెలివేమిటి అప్పుడు తెలిసొచ్చింది. అది వెంటనే ఇంట్లోకి వెళ్లి రెడ్ టవల్ ఒకటి తీసుకుని, చెంగుచెంగున గెంతుతూ కింద ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆ సిగ్నల్ అర్ధం చేసుకున్న కానిస్టేబుల్ ట్రాఫిక్ ను తక్షణమే ఆపేశాడు. ఆనాడు కుక్క లేకపోతే ఎన్నివందల ప్రాణాలు పోయేవో గదా. "నిజమే. కుక్కకున్నబుద్ధి మనుషులకు లేదు. కొయ్యి". అన్నాడు డిటెక్టివ్. అవన్నీ కోతలని డిటెక్టివ్ కెలా తెలిసింది?
కుక్కలను పెంచినవాళ్ళకే తెలుస్తుంది వాటి విలువేమిటో. మనుషుల కన్నా ఎక్కువ సాయం చేస్తాయవి. బంతిని విసిరేస్తే తీసుకురావడం, గుమ్మంలో ఉన్న పేపరు తెచ్చివ్వడం లాంటి సరదా ఆటలు మాత్రమే కాదు. ఒకసారి నేర్పించామంటే ప్రాణాలకు తెగించి మరీ సాయం చేస్తాయి. ఓ చిన్నకథ చెబుతాను వినండి. మా తాత దగ్గరో కుక్కుండేది. ఆయనకి కాస్త తిక్క కొండల్లో, రెండు శిఖరాల మధ్య ఓ హెయిర్ పిన్ బెండ్ లో కట్టుకున్నాడు ఇల్లు. ఆ ఒంటరి మనిషికి కుక్క తోడూ. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్నప్పుడు కింద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ఆయన ఎర్రజెండా ఊపి సైగ చేసేవాడు. అది సంకేతంగా, ఘాట్ రోడ్డు మీద వాహనాల రాకపోకల్ని నియంత్రించే వాళ్ళు. ఒకనాడు కింద, ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు రాళ్ళు పడటం ప్రారంభమైంది. మొదట తాతగారి తలమీద రాయిపడటంతో ఆయన స్పృహ కోల్పోయాడు. అంతే. కుక్క తెలివేమిటి అప్పుడు తెలిసొచ్చింది. అది వెంటనే ఇంట్లోకి వెళ్లి రెడ్ టవల్ ఒకటి తీసుకుని, చెంగుచెంగున గెంతుతూ కింద ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆ సిగ్నల్ అర్ధం చేసుకున్న కానిస్టేబుల్ ట్రాఫిక్ ను తక్షణమే ఆపేశాడు. ఆనాడు కుక్క లేకపోతే ఎన్నివందల ప్రాణాలు పోయేవో గదా. "నిజమే. కుక్కకున్నబుద్ధి మనుషులకు లేదు. కొయ్యి". అన్నాడు డిటెక్టివ్. అవన్నీ కోతలని డిటెక్టివ్ కెలా తెలిసింది?© 2017,www.logili.com All Rights Reserved.