వాస్తవానికి కథ వ్రాయడం పెద్ద కష్టమైన పనికాదు! బ్రహ్మవిద్య అంతకన్నా కాదు! గొప్ప చదువులే చదివి ఉండాల్సిన అవసరమూ లేదు!! ఎనిమిదవ తరగతి వరకే చదివినవాళ్ళు.. అంతకన్నా తక్కువ చదివినవారు కూడా గతంలో కాలక్రమాన కథా, నవలా రచయితలుగా, నాటక కర్తలుగా... కొందరైతే పద్యకవులుగా కూడా లబ్ద ప్రతిష్టులయ్యారు. వారిలో కొందరు మన దేశంలోనే కాక విదేశాలలో సైతం ఖ్యాతిని పొందగలిగారు. సాధనమున పనులు సమకూరగలవు. నేనూ 'వ్రాయగలను!' అన్న ఆత్మవిశ్వాసంతో సాధన మొదలు పెట్టాలి.
కథారచన అనేది ఒక సృజనాత్మక కళ దానిని ఒపోకగా, క్రమబద్ధంగా శ్రద్ధతో అలవరచుకోవాలి. వ్యక్తి స్వభావం ఎలాంటిదయినా, వారు ఏ వయసు వారయినా రచనా వ్యాసంగం అలవరచుకొని రచయిత లేక రచయిత్రి అయి ప్రాచుర్యంలోనికి రావడం అన్నది నిజానికి సులభసాధ్యమైన విషయమే! జీవన గమనంలోని భావపరంపరలను అనుభవించ గలిగితే చాలు! అందుకు వారికి మొట్టమొదట కావాల్సింది ఓర్మి.. తదుపరి కృషి! ఓపికతో కృషితో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు! కృషితో నాస్తి దుర్భిక్ష్యం! కాని దానికి కథను గూర్చి కొద్దిగా తెలుసుకోవడం అవసరం.
వాస్తవానికి కథ వ్రాయడం పెద్ద కష్టమైన పనికాదు! బ్రహ్మవిద్య అంతకన్నా కాదు! గొప్ప చదువులే చదివి ఉండాల్సిన అవసరమూ లేదు!! ఎనిమిదవ తరగతి వరకే చదివినవాళ్ళు.. అంతకన్నా తక్కువ చదివినవారు కూడా గతంలో కాలక్రమాన కథా, నవలా రచయితలుగా, నాటక కర్తలుగా... కొందరైతే పద్యకవులుగా కూడా లబ్ద ప్రతిష్టులయ్యారు. వారిలో కొందరు మన దేశంలోనే కాక విదేశాలలో సైతం ఖ్యాతిని పొందగలిగారు. సాధనమున పనులు సమకూరగలవు. నేనూ 'వ్రాయగలను!' అన్న ఆత్మవిశ్వాసంతో సాధన మొదలు పెట్టాలి. కథారచన అనేది ఒక సృజనాత్మక కళ దానిని ఒపోకగా, క్రమబద్ధంగా శ్రద్ధతో అలవరచుకోవాలి. వ్యక్తి స్వభావం ఎలాంటిదయినా, వారు ఏ వయసు వారయినా రచనా వ్యాసంగం అలవరచుకొని రచయిత లేక రచయిత్రి అయి ప్రాచుర్యంలోనికి రావడం అన్నది నిజానికి సులభసాధ్యమైన విషయమే! జీవన గమనంలోని భావపరంపరలను అనుభవించ గలిగితే చాలు! అందుకు వారికి మొట్టమొదట కావాల్సింది ఓర్మి.. తదుపరి కృషి! ఓపికతో కృషితో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు! కృషితో నాస్తి దుర్భిక్ష్యం! కాని దానికి కథను గూర్చి కొద్దిగా తెలుసుకోవడం అవసరం.© 2017,www.logili.com All Rights Reserved.