దిగువ మధ్యతరగతి కుటుంబాలలో వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, మమతానురాగాలు ఉంటాయి కానీ, వాటిని ప్రకటించగల స్థోమత ఉండదు. అంటే మానవ జీవితాలలో అతి ముఖ్యమైన ఆర్థిక సంబంధాలు ఆ బంధాలను అదుపులో ఉంచుతాయి. తల్లిదండ్రులు, సంతానం మధ్య, ఏకోదరుల మధ్య ఈ అనుబంధాల మూలంగా 'పరువు దెబ్బతినకూడదు, అలా అని బరువు కాకూడదు' అని ఆశిస్తారు ఆ వ్యక్తులు, 'ధనమూలమిదం జగత్' అనే విషయం ఈ వర్గానికి తెలిసినంత బాగా తక్కిన స్థాయిల వారికి తెలియదేమో! 'డబ్బు లేకపోతే డబ్బుకు కొరగాడు' అనేది వీళ్ళ అనుభవంలోకి వచ్చినంతగా తక్కిన సామాజిక తరగతుల వారికి తెలియవలసిన అక్కరలేదు. న్యాయంగా జీవితంలో లభించవలసిన చిన్న చిన్న సంతృప్తులు, సౌకర్యాలు, ఓదార్పులు, సానుభూతులు మనసున్న మధ్యతరగతి వ్యక్తులలో లభించవు.
మొట్ట మొదటిసారి పుట్టింటికి వెళుతున్న ముద్దరాలు ఒంటరిగా రైల్లో ప్రయాణం చేయడం అటువంటి సంఘటన. అందుకు కారణం 'లేమి' తప్ప మరేమీ? తన ప్రాణానికి ప్రాణంగా చూసుకోవలసిన భార్య తొలిసారి పుట్టింటికి వెళుతూ రైలు పెట్టెలో వీడ్కోలు చెబుతున్న భర్తతో "ఓ ఇరవై రూపాయలుంటే ఇవ్వరూ!" అని అడుగుతుంటే ఓ రెండురూపాయలు చేతిలో పెట్టి ఎటువంటి భావోద్వేగమూ లేకుండా కదిలిపోయే రైలును గుడ్లప్పగిస్తూ చూసే భర్త ఈమధ్య తరగతిలో కాక మరెక్కడ కనిపిస్తాడు? పుట్టింటివారు పేదవారు, కట్టుకొన్న భర్తలో అంతఃకరణ దారిద్ర్యం కూడా అందుకు తోడైతే ఆ తొలికాన్పు ఇల్లాలి మనస్సు ఎంత బాధపడుతుందో హృదయ సంస్పంద సుందరంగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 'జన్మదిన సంచిక కథలపోటీ 1990 లో ద్వితీయ బహుమతి పొందిన కథ 'బాధ్యతాబంధం'లో శ్రీ అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాస మూర్తి గారు చిత్రించారు. అయితే రాబోయే తరం బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకోవడం లేదు. తులసి, మణి, అంజిబాబు తమ అక్క విజయ కోసం పడిన ఆరాటం మానవ సంబంధాలలో ఆశావహమైన ఆర్ద్రపూరితమైన కొత్త విలువలను ఆవిష్కరించడం 'మూడుపదులు' లోని 'బాధ్యతాబంధం' కథలో మెచ్చవలసిన అంశం!
- పోరంకి దక్షిణమూర్తి
- అక్కిరాజు రమాపతిరావు
దిగువ మధ్యతరగతి కుటుంబాలలో వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, మమతానురాగాలు ఉంటాయి కానీ, వాటిని ప్రకటించగల స్థోమత ఉండదు. అంటే మానవ జీవితాలలో అతి ముఖ్యమైన ఆర్థిక సంబంధాలు ఆ బంధాలను అదుపులో ఉంచుతాయి. తల్లిదండ్రులు, సంతానం మధ్య, ఏకోదరుల మధ్య ఈ అనుబంధాల మూలంగా 'పరువు దెబ్బతినకూడదు, అలా అని బరువు కాకూడదు' అని ఆశిస్తారు ఆ వ్యక్తులు, 'ధనమూలమిదం జగత్' అనే విషయం ఈ వర్గానికి తెలిసినంత బాగా తక్కిన స్థాయిల వారికి తెలియదేమో! 'డబ్బు లేకపోతే డబ్బుకు కొరగాడు' అనేది వీళ్ళ అనుభవంలోకి వచ్చినంతగా తక్కిన సామాజిక తరగతుల వారికి తెలియవలసిన అక్కరలేదు. న్యాయంగా జీవితంలో లభించవలసిన చిన్న చిన్న సంతృప్తులు, సౌకర్యాలు, ఓదార్పులు, సానుభూతులు మనసున్న మధ్యతరగతి వ్యక్తులలో లభించవు. మొట్ట మొదటిసారి పుట్టింటికి వెళుతున్న ముద్దరాలు ఒంటరిగా రైల్లో ప్రయాణం చేయడం అటువంటి సంఘటన. అందుకు కారణం 'లేమి' తప్ప మరేమీ? తన ప్రాణానికి ప్రాణంగా చూసుకోవలసిన భార్య తొలిసారి పుట్టింటికి వెళుతూ రైలు పెట్టెలో వీడ్కోలు చెబుతున్న భర్తతో "ఓ ఇరవై రూపాయలుంటే ఇవ్వరూ!" అని అడుగుతుంటే ఓ రెండురూపాయలు చేతిలో పెట్టి ఎటువంటి భావోద్వేగమూ లేకుండా కదిలిపోయే రైలును గుడ్లప్పగిస్తూ చూసే భర్త ఈమధ్య తరగతిలో కాక మరెక్కడ కనిపిస్తాడు? పుట్టింటివారు పేదవారు, కట్టుకొన్న భర్తలో అంతఃకరణ దారిద్ర్యం కూడా అందుకు తోడైతే ఆ తొలికాన్పు ఇల్లాలి మనస్సు ఎంత బాధపడుతుందో హృదయ సంస్పంద సుందరంగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 'జన్మదిన సంచిక కథలపోటీ 1990 లో ద్వితీయ బహుమతి పొందిన కథ 'బాధ్యతాబంధం'లో శ్రీ అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాస మూర్తి గారు చిత్రించారు. అయితే రాబోయే తరం బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకోవడం లేదు. తులసి, మణి, అంజిబాబు తమ అక్క విజయ కోసం పడిన ఆరాటం మానవ సంబంధాలలో ఆశావహమైన ఆర్ద్రపూరితమైన కొత్త విలువలను ఆవిష్కరించడం 'మూడుపదులు' లోని 'బాధ్యతాబంధం' కథలో మెచ్చవలసిన అంశం! - పోరంకి దక్షిణమూర్తి - అక్కిరాజు రమాపతిరావు© 2017,www.logili.com All Rights Reserved.