'మనతరంలో మహాపురుషుడెవరు ?' అని ప్రశ్నించడం నేడు పరిపాటి, సరదా అయిపోయింది. ఈ ప్రశ్నేగనక ఆంగ్లేయులకు వేస్తే వారు 'విన్స్టన్ చర్చిల్' అని సమాధానం చెప్పుతారు. కమ్యూనిస్టులు 'లెనిన్, స్టాలిన్' అని జవాబు ఇస్తారు. దీనికే భారతీయులు, ఒక్క భారతీయులేమిటి ఆసియా ఖండవాసులంతా 'మహాత్మాగాంధి' అంటారు. వీరందరూ, మహా ప్రతిభా సంపన్ను లనడంలోగాని, వీరు విశ్వసించిన సిద్ధాంతాలకు గొప్ప సేవ చేసారనడంలో గాని ఎట్టి అనుమానమూ లేదు. అయితే వీరిలో ప్రతివారూ తమ ప్రజకు ప్రప్రథమంగా సేవచేయడంలో నిమగ్నులయినారు. వీరి దృష్టిలో ప్రపంచసేవ ద్వితీయం. కాని ఇంకొక మహావ్యక్తి ఉన్నారు. ఆయన సంగీతంలో తత్త్వశాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రాలలో మహామేధావి. ఈఈ రంగాలలో గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకో గలిగినవారే. కాని కొత్త ప్రదేశాలలో, కొత్త ప్రజానీకానికి సేవచేయాలనే ఉద్దేశ్యంతో స్వదేశంలో నివసించి స్వప్రజకు సేవచేయడం వల్ల లభించే లాభాలను పరిత్యజించారు. ఆ మహావ్యక్తి ఆల్బర్ట్ స్వయిట్చర్. ఆయన మనసావాచా క్రైస్తవులు. ఎన్నడూ నల్ల తెల్ల జాతిభేదం ఆయన పెట్టుకోలేదు. పైగా క్రైస్తవ సిద్ధాంతాలకు వ్యతిరిక్తంగా తెల్లవారు నల్లవారిని దోపిడీ చేస్తున్నందుకు సిగ్గుపడ్డారు. ఈ పాపానికి పరిహారంగా నాగరిక జీవితంవల్ల కలిగే సుఖాలను వదిలివేసి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు. ఆ అజ్ఞాత ప్రదేశమే నేడు ప్రపంచ విఖ్యాతిగాంచిన లాంబెరెనీ. ఇది ఫ్రెంచి ఆఫ్రికాలో ఉంది....................
ప్రవేశిక - ఎ.ఆర్. వాడియా 'మనతరంలో మహాపురుషుడెవరు ?' అని ప్రశ్నించడం నేడు పరిపాటి, సరదా అయిపోయింది. ఈ ప్రశ్నేగనక ఆంగ్లేయులకు వేస్తే వారు 'విన్స్టన్ చర్చిల్' అని సమాధానం చెప్పుతారు. కమ్యూనిస్టులు 'లెనిన్, స్టాలిన్' అని జవాబు ఇస్తారు. దీనికే భారతీయులు, ఒక్క భారతీయులేమిటి ఆసియా ఖండవాసులంతా 'మహాత్మాగాంధి' అంటారు. వీరందరూ, మహా ప్రతిభా సంపన్ను లనడంలోగాని, వీరు విశ్వసించిన సిద్ధాంతాలకు గొప్ప సేవ చేసారనడంలో గాని ఎట్టి అనుమానమూ లేదు. అయితే వీరిలో ప్రతివారూ తమ ప్రజకు ప్రప్రథమంగా సేవచేయడంలో నిమగ్నులయినారు. వీరి దృష్టిలో ప్రపంచసేవ ద్వితీయం. కాని ఇంకొక మహావ్యక్తి ఉన్నారు. ఆయన సంగీతంలో తత్త్వశాస్త్రంలో, విజ్ఞాన శాస్త్రాలలో మహామేధావి. ఈఈ రంగాలలో గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకో గలిగినవారే. కాని కొత్త ప్రదేశాలలో, కొత్త ప్రజానీకానికి సేవచేయాలనే ఉద్దేశ్యంతో స్వదేశంలో నివసించి స్వప్రజకు సేవచేయడం వల్ల లభించే లాభాలను పరిత్యజించారు. ఆ మహావ్యక్తి ఆల్బర్ట్ స్వయిట్చర్. ఆయన మనసావాచా క్రైస్తవులు. ఎన్నడూ నల్ల తెల్ల జాతిభేదం ఆయన పెట్టుకోలేదు. పైగా క్రైస్తవ సిద్ధాంతాలకు వ్యతిరిక్తంగా తెల్లవారు నల్లవారిని దోపిడీ చేస్తున్నందుకు సిగ్గుపడ్డారు. ఈ పాపానికి పరిహారంగా నాగరిక జీవితంవల్ల కలిగే సుఖాలను వదిలివేసి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు. ఆ అజ్ఞాత ప్రదేశమే నేడు ప్రపంచ విఖ్యాతిగాంచిన లాంబెరెనీ. ఇది ఫ్రెంచి ఆఫ్రికాలో ఉంది....................© 2017,www.logili.com All Rights Reserved.