కర్ణుడి మహాజీవన
యాత్ర ఉయ్యాల నుండి మరుభూమి దాకా...
మృత్యుంజయ (మృత్యుంజయుడు)లో ఆకాశం, భూమి, సాగరాలు ఉన్నాయి. ఆకాశంలో నీలిరంగు, ఇంద్రధనుస్సు, సూర్య - చంద్రులతో పాటు కటికచీకటి కూడా ఉంటుంది. భూమిపైన వాసంత సమీరాలు ఉంటాయి. గాలిదుమారాలు ఉంటాయి. సాగరంలో కళ్ళకు కాంతి సౌందర్యాలతో పాటు ఆటుపోట్లు ఉంటాయి. బడబాగ్ని కూడా ఉంటుంది. ఈ మూడింటిలోనూ మన కావ్య జగత్తును స్పర్శించి శిశిరానికి వసంతాన్నిచ్చే గుణం ఉంటుంది.
కీ.శే. శివాజీ సావంత్గారు 1967లో రాసిన 'మృత్యుంజయ' కలానికి వన్నె తెచ్చిన ఒక అద్భుతమైన విలువైన పుస్తకం. వారి ముందుమాట చదివినప్పుడు ఈ నవల రాయడానికి ఆయన ఎంత తపన పడ్డారో, ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకున్నారో తెలుస్తుంది.
ఇదివరకు ఒక పెద్ద బొమ్మ వచ్చేది. ఈ బొమ్మలో మరోచిన్న బొమ్మ దానిలో మరొకటి, ఈ విధంగా ఏడు బొమ్మలు ఉంటాయి. ఆరోజుల్లో, దాదాపు 60 సం.ల క్రితం దీన్ని రష్యావాళ్ళు తయారు చేసారు అని అనేవాళ్ళు. దీనిని ఎవరు ఎప్పుడు తయారు చేసారో కానీ, మన మనస్సుకు ప్రతీక ఈ బొమ్మ. మనలోని అంతర్ మథనానికి ఇది ప్రతీక. ఏడు బొమ్మలు ఏడు పొరలకు ప్రతీక. ఉయ్యాల నుండి మరుభూమి దాకా కర్ణుడి జీవన మహాయాత్రకు ఈ బొమ్మను మనం ప్రతీకగా తీసుకోవచ్చును.
'మహాభారత్' గ్రంథం భారతీయ సంస్కృతికి తలమానికం. 'మహాభారతం ఒక పెద్ద గని. అందులోంచి ఎన్నెన్నో కొత్త కొత్త వాటిని వెతికి తీయగలుగుతాం. ఎవరో ఒకరు రాసిన భారతంలో అన్ని విషయాలు వచ్చాయని ఎంతమాత్రం చెప్పలేం' అని ఈరావతి కర్వే గారు అన్నారు. 'ఈ గని నుండి ఈనాటి వరకు మన చేతిలోకి ఎన్నో రత్నాలు వచ్చినా, ఇంకా చేతికి రావల్సినవి ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది పరిశోధకులు పండితులు, ఈనాటికి ఈ గనిలో ఇంకా కొత్త రత్నాల కోసం వెతుకుతూనే ఉన్నారు." అని శ్రీ కేశవ సీతారామ ఠాకరే అన్నారు.
తెలుగులో ప్రత్యేకంగా కర్ణుడి పాత్రనే కేంద్రబిందువుగా తీసుకుని రాసిన పుస్తకాలు ఒకటో రెండో తప్పితే ఎక్కువగా లేవనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా వివరాలు తెలియవు. సినిమాలు, సీరియల్స్, వస్తునే ఉన్నాయి. 1959లో ప్రచురితం అయిన కీ.శే. మరువూరు కోదండరామరెడ్డిగారు రాసిన 'కర్ణ చరిత'లో కర్ణుడి గురించిన విశ్లేషణ ఉంది. వ్యాస సంస్కృత మహాభారతం, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడల తెలుగుభారతం, వీటిలో ఉన్న భేదాలు ఒకే రచయిత చెప్పిన దాంట్లో ఉన్న విరోధ భావాలు, చారిత్రకంగా సంవత్సరాలను ఇస్తూ విశ్లేషణ చేశారు రచయిత. ఇది పరిశోధనాపరమైన రచన. దీని వెల 3 రూపాయల 50 పైసలు. మందాకినీ హంసముల ప్రచురించింది. కృతిభర్త శ్రీ...........
కర్ణుడి మహాజీవన యాత్ర ఉయ్యాల నుండి మరుభూమి దాకా... మృత్యుంజయ (మృత్యుంజయుడు)లో ఆకాశం, భూమి, సాగరాలు ఉన్నాయి. ఆకాశంలో నీలిరంగు, ఇంద్రధనుస్సు, సూర్య - చంద్రులతో పాటు కటికచీకటి కూడా ఉంటుంది. భూమిపైన వాసంత సమీరాలు ఉంటాయి. గాలిదుమారాలు ఉంటాయి. సాగరంలో కళ్ళకు కాంతి సౌందర్యాలతో పాటు ఆటుపోట్లు ఉంటాయి. బడబాగ్ని కూడా ఉంటుంది. ఈ మూడింటిలోనూ మన కావ్య జగత్తును స్పర్శించి శిశిరానికి వసంతాన్నిచ్చే గుణం ఉంటుంది. కీ.శే. శివాజీ సావంత్గారు 1967లో రాసిన 'మృత్యుంజయ' కలానికి వన్నె తెచ్చిన ఒక అద్భుతమైన విలువైన పుస్తకం. వారి ముందుమాట చదివినప్పుడు ఈ నవల రాయడానికి ఆయన ఎంత తపన పడ్డారో, ఎన్ని కష్టనష్టాలకు ఓర్చుకున్నారో తెలుస్తుంది. ఇదివరకు ఒక పెద్ద బొమ్మ వచ్చేది. ఈ బొమ్మలో మరోచిన్న బొమ్మ దానిలో మరొకటి, ఈ విధంగా ఏడు బొమ్మలు ఉంటాయి. ఆరోజుల్లో, దాదాపు 60 సం.ల క్రితం దీన్ని రష్యావాళ్ళు తయారు చేసారు అని అనేవాళ్ళు. దీనిని ఎవరు ఎప్పుడు తయారు చేసారో కానీ, మన మనస్సుకు ప్రతీక ఈ బొమ్మ. మనలోని అంతర్ మథనానికి ఇది ప్రతీక. ఏడు బొమ్మలు ఏడు పొరలకు ప్రతీక. ఉయ్యాల నుండి మరుభూమి దాకా కర్ణుడి జీవన మహాయాత్రకు ఈ బొమ్మను మనం ప్రతీకగా తీసుకోవచ్చును. 'మహాభారత్' గ్రంథం భారతీయ సంస్కృతికి తలమానికం. 'మహాభారతం ఒక పెద్ద గని. అందులోంచి ఎన్నెన్నో కొత్త కొత్త వాటిని వెతికి తీయగలుగుతాం. ఎవరో ఒకరు రాసిన భారతంలో అన్ని విషయాలు వచ్చాయని ఎంతమాత్రం చెప్పలేం' అని ఈరావతి కర్వే గారు అన్నారు. 'ఈ గని నుండి ఈనాటి వరకు మన చేతిలోకి ఎన్నో రత్నాలు వచ్చినా, ఇంకా చేతికి రావల్సినవి ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది పరిశోధకులు పండితులు, ఈనాటికి ఈ గనిలో ఇంకా కొత్త రత్నాల కోసం వెతుకుతూనే ఉన్నారు." అని శ్రీ కేశవ సీతారామ ఠాకరే అన్నారు. తెలుగులో ప్రత్యేకంగా కర్ణుడి పాత్రనే కేంద్రబిందువుగా తీసుకుని రాసిన పుస్తకాలు ఒకటో రెండో తప్పితే ఎక్కువగా లేవనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా వివరాలు తెలియవు. సినిమాలు, సీరియల్స్, వస్తునే ఉన్నాయి. 1959లో ప్రచురితం అయిన కీ.శే. మరువూరు కోదండరామరెడ్డిగారు రాసిన 'కర్ణ చరిత'లో కర్ణుడి గురించిన విశ్లేషణ ఉంది. వ్యాస సంస్కృత మహాభారతం, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడల తెలుగుభారతం, వీటిలో ఉన్న భేదాలు ఒకే రచయిత చెప్పిన దాంట్లో ఉన్న విరోధ భావాలు, చారిత్రకంగా సంవత్సరాలను ఇస్తూ విశ్లేషణ చేశారు రచయిత. ఇది పరిశోధనాపరమైన రచన. దీని వెల 3 రూపాయల 50 పైసలు. మందాకినీ హంసముల ప్రచురించింది. కృతిభర్త శ్రీ...........© 2017,www.logili.com All Rights Reserved.