అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్ళనిబట్టి ఉంటాయి. ఇందులో ఉన్న అమెరికా అబ్జర్వేషన్లు డా సోమరాజు సుశీలవి. విమానాల్లోంచో, రైళ్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల మీద దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నిజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి సంస్కృతిని అవగతం చేసుకోవాలి. అంటే ఆ ప్రాంతాన్ని మరోసారి కనిపెట్టడమే అవుతుంది. కథలు - కథనాలలో మనం ఆహ్లాదపడే భోగట్టా ఉంది. దాని తాలూకు అంతరంగమూ ఉంది. ప్రపంచదేశాల వారంతా సహజీవనం చేస్తూ అవకాశాల అమెరికా నేల మీద కనిపిస్తారు. అక్కడ వినిపించే వివిధ సంస్కృతుల సంగీతం ఏడు రంగుల ఇంద్రధనసులా కమనీయంగా కనిపిస్తుంది. ఆ వాద్యస్వర సమ్మేళనానికి అక్షరరూపం ఈ రచన.
అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్ళనిబట్టి ఉంటాయి. ఇందులో ఉన్న అమెరికా అబ్జర్వేషన్లు డా సోమరాజు సుశీలవి. విమానాల్లోంచో, రైళ్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల మీద దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నిజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి సంస్కృతిని అవగతం చేసుకోవాలి. అంటే ఆ ప్రాంతాన్ని మరోసారి కనిపెట్టడమే అవుతుంది. కథలు - కథనాలలో మనం ఆహ్లాదపడే భోగట్టా ఉంది. దాని తాలూకు అంతరంగమూ ఉంది. ప్రపంచదేశాల వారంతా సహజీవనం చేస్తూ అవకాశాల అమెరికా నేల మీద కనిపిస్తారు. అక్కడ వినిపించే వివిధ సంస్కృతుల సంగీతం ఏడు రంగుల ఇంద్రధనసులా కమనీయంగా కనిపిస్తుంది. ఆ వాద్యస్వర సమ్మేళనానికి అక్షరరూపం ఈ రచన.© 2017,www.logili.com All Rights Reserved.