ఇవి కథలు కావు. అనగా కథ అనే ప్రక్రియను గురించి లాక్షణికులు ఏవేవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఏ ప్రక్రియనూ అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందొ అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం కనుక నేను వీటిని కథలు కాదంటున్నాను. అట్టైతే కథలు అని పేరెందుకు పెట్టావంటారా....?
ఫలానా వాడి కత తెలుసునా......? ఆ పిల్ల కత ఇది....! ని కత నాకు తెలుసులే....! అని ఇలా అనటం అనుకోవటాల్లో అక్కడ "కత" అని అంటుండేది ఒకరి బతుకును ఉద్దేశించి అని తెలుస్తోంది కదా. బుర్ర కథలూ, హరికథలూ అని వ్యవహరిస్తున్నప్పుడు ఆలా అంటోంది నిజానికి అచ్చంగా కథల్ని అనైతే కాదు కదా.అలాగే ఇవికూడా కథలు కానీ మా పల్లె మనుషుల బతుకుల కతలు.