ఆంగ్లేయ విద్యావిధానంలో విద్యనర్జించినవారి ఆలోచనా సరళిలో చాలా కొత్త భావాలు సందదించాసగినాయి. ఎక్కువమంది ఉద్యోగాలకు సద్యోగాలకు అంకితమైపోయినా, నూతన విద్యావంతులు దేశం యొక్క సాంఘిక, మత,ఆర్ధిక, రాజకియాది పరిస్ధితులను గూర్చి నిశితంగా ఆలోచించటం, వాటిని గూర్చి కొత్త సిద్దంతాలు చేయటం,కార్య ప్రణాళికలు చేపట్టటం, ఉద్యమాలకు పూనుకోవటం ఆరంభమైంది. ప్రధానంగా వీరి అందరిది "సంస్కరణ దృష్టి".
సామాజికంగా సాగిన సంస్కరణ కృషిలో స్ర్తీల సమస్యలు ప్రాముఖ్యాన్ని వహించినాయి. బాల్య వివాహాలు,సహగమనం, బలాత్కార వైధవ్య దుర్దశ,విద్యాగంధ రాహిత్యం, మొదలయిన వాటిని గూర్చి ఎంతగానో చర్చలు జరిగినాయి. సమాజంలో ఈ సమస్యలపట్ల సదవగాహన కల్పించటానికి పరిష్కర చర్యల పట్ల సుముఖత కల్పించటానికి ఎంతో కృషి జరిగింది. కన్యాశుల్కలు, వరవిక్రయాలు మొదలయిన వాటితో పెనవేసుకున్న వివాహ వ్యవస్ధను అందరూ గర్హించారు. పురుషునితో సమానంగా స్ర్తీకి కుటుంబంలో, సమాజంలో స్ధానము, హక్కులు, కలిగించాలని ప్రయత్నాలు జరిగినాయి.
ఆంగ్లేయ విద్యావిధానంలో విద్యనర్జించినవారి ఆలోచనా సరళిలో చాలా కొత్త భావాలు సందదించాసగినాయి. ఎక్కువమంది ఉద్యోగాలకు సద్యోగాలకు అంకితమైపోయినా, నూతన విద్యావంతులు దేశం యొక్క సాంఘిక, మత,ఆర్ధిక, రాజకియాది పరిస్ధితులను గూర్చి నిశితంగా ఆలోచించటం, వాటిని గూర్చి కొత్త సిద్దంతాలు చేయటం,కార్య ప్రణాళికలు చేపట్టటం, ఉద్యమాలకు పూనుకోవటం ఆరంభమైంది. ప్రధానంగా వీరి అందరిది "సంస్కరణ దృష్టి". సామాజికంగా సాగిన సంస్కరణ కృషిలో స్ర్తీల సమస్యలు ప్రాముఖ్యాన్ని వహించినాయి. బాల్య వివాహాలు,సహగమనం, బలాత్కార వైధవ్య దుర్దశ,విద్యాగంధ రాహిత్యం, మొదలయిన వాటిని గూర్చి ఎంతగానో చర్చలు జరిగినాయి. సమాజంలో ఈ సమస్యలపట్ల సదవగాహన కల్పించటానికి పరిష్కర చర్యల పట్ల సుముఖత కల్పించటానికి ఎంతో కృషి జరిగింది. కన్యాశుల్కలు, వరవిక్రయాలు మొదలయిన వాటితో పెనవేసుకున్న వివాహ వ్యవస్ధను అందరూ గర్హించారు. పురుషునితో సమానంగా స్ర్తీకి కుటుంబంలో, సమాజంలో స్ధానము, హక్కులు, కలిగించాలని ప్రయత్నాలు జరిగినాయి.© 2017,www.logili.com All Rights Reserved.