పల్లవరం పరిసరాల్లో చిన్న కొంప కట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు సూర్యనారాయణగారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటారు 'దేవుడు దయతలచి నాకు ఆడపిల్లని ప్రసాదించలేదు. అధిక సంతానం ప్రసాదించలేదు. ఒక్క కొడుకునిచ్చి ఊరుకున్నాడు. నాపట్ల ఎంత కరుణ చూపాడు!' అని, కొడుకుని పట్నంలో చదివించినా కాపురం మార్చలేదు. పట్నం ఖర్చులు భరించలేనని సూర్యనారాయణ గారికి బాగా తెలుసు. కొడుకు చదువు సవ్యంగానే ముగించాడు. కాని ఉద్యోగ ప్రయత్నాలే సవ్యంగా సాగడంలేదని ఆయన బాధ.
ఈ ప్రయత్నాలు సాగుతుండగానే సూర్యనారాయణగారి భార్య దైవసన్నిధికి చేరిపోయింది. 'ఎంతటి అదృష్టవంతురాలు! ఈ నరహరి గాడి పోకడలు చూసి బాధపడకుండా పోయింది' అని మనసులో ఆమె అదృష్టానికి కాస్త అసూయ కూడా పడడం ప్రారంభించారు. కొడుకు పేరు నరహరి అని పెట్టుకున్నా అంతా 'హరీ' అని పిలవడమే అలవాటైపోయింది. తరువాత ఏం జరిగిందో ఈ కథల సంపుటిని చదివి తెలుసుకొనగలరు.
పల్లవరం పరిసరాల్లో చిన్న కొంప కట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు సూర్యనారాయణగారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటారు 'దేవుడు దయతలచి నాకు ఆడపిల్లని ప్రసాదించలేదు. అధిక సంతానం ప్రసాదించలేదు. ఒక్క కొడుకునిచ్చి ఊరుకున్నాడు. నాపట్ల ఎంత కరుణ చూపాడు!' అని, కొడుకుని పట్నంలో చదివించినా కాపురం మార్చలేదు. పట్నం ఖర్చులు భరించలేనని సూర్యనారాయణ గారికి బాగా తెలుసు. కొడుకు చదువు సవ్యంగానే ముగించాడు. కాని ఉద్యోగ ప్రయత్నాలే సవ్యంగా సాగడంలేదని ఆయన బాధ. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే సూర్యనారాయణగారి భార్య దైవసన్నిధికి చేరిపోయింది. 'ఎంతటి అదృష్టవంతురాలు! ఈ నరహరి గాడి పోకడలు చూసి బాధపడకుండా పోయింది' అని మనసులో ఆమె అదృష్టానికి కాస్త అసూయ కూడా పడడం ప్రారంభించారు. కొడుకు పేరు నరహరి అని పెట్టుకున్నా అంతా 'హరీ' అని పిలవడమే అలవాటైపోయింది. తరువాత ఏం జరిగిందో ఈ కథల సంపుటిని చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.