అర్ద శతాబ్ది పాటు నాతోపాటు కలిసి బ్రతికిన ఓ వ్యక్తి మృతశరీరం - నా ముందు అన్ని బంధాలకు దూరంగా, అన్ని వ్యధులకు అతీతంగా, ప్రశాంతంగా.. పడుకొనివుంది.
తాను లేందే బ్రతుకులేననుకున్న నాకు - తన హఠాన్మరణం చాలా పెద్ద షాక్ !
అయినా.. నా గుండె కొట్టుకుంటూనే వుంది. నా మెదడు ఆలోచిస్తూనే వుంది.
పావడా, జాకెట్టు వేసుకుని రెండు జడలతో బెరుకు బెరుగ్గా తొమ్మిదో క్లాసులో అడుగు పెట్టాను.
అంతవరకూ పల్లెటూరిలో చదివి, నాన్నగారు నెల్లూరు రావడంతో - అంతవరకూ పెంచుకున్న బాల్య స్నేహాల్ని, ఆ పరిసరాల మీద పెంచుకున్న బంధాల్ని తెంపుకుని దిగులుగా, బెరుకు బెరుగ్గా నడుస్తూ వెళ్తున్న నన్ను - అందరూ ఎగాదిగా చూస్తున్నారు గానీ, ఎవ్వరు నావైపు స్నేహంగా చూడలేదు. మూడేళ్లుగా అదే స్కూల్ లో కలిసి చదివిన వాళ్ళకు నేను పరాయి వ్యక్తిగా కన్పించానేమో?! తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.