వస్తువులో వైవిధ్యం-కథనంలో సౌందర్యం
పాఠకుల్లో హృదయ సంస్కారానికి బాటలు వేసేది నిజమైన కథ. మన కాలానికి అవసరమైన కథ. ఆవేశకావేషాల కన్నా ఆలోచన ప్రధానం. ఆలోచింపజేయడంతో పాటు అంతరాంతరాల్లో మథనానికి లోను చేయడం అవసరం. కలలో మెలకువలో కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రలు మనల్ని వెంటాడటమన్నది మంచి కథల లక్షణం. లోలోపల తెలియని కలవరానికి లోను చేయడం కథా సంవిధానంలోని సుగుణం. ఇలాంటి కథలే నాలుగు కాలాల పాటు నిలిచిపోతాయి. నలుగురికి గుర్తుండిపోతాయి. ఆయా సందర్భాలకు అనుగుణంగా కథలు, కథల్లోని పాత్రలు స్పురణకొస్తాయి. ఈరీతిన అసంకల్పితంగానే మన అంతరంగాన్ని పట్టి కుదిపే కథలు రాశారు డాక్టర్ ఎమ్.సుగుణరావు.
ఇదివరలో అపుడపుడు సుగుణరావు కథలు చదివాను. ఇటీవలి కాలాన | వారి కథలు ఒక్కచోట చదువుతూ వచ్చాను. ఆరునెలల పైబడి ఈ కథలతో ప్రయాణించా. రెండు డజన్ల కథలతో పుస్తకంగా రాబోయే ముందు చదివే అవకాశం రావడం ఆనందదాయకం, చిత్రమైన అనుభూతులకు ఆలవాలం. కథలన్నిటినీ ఏకబిగిన చదవడం కష్టం. అలవోకగా చదవడం కుదరదు. ఒక కథ చదివాక అందులోని పాత్రలు తెలియకనే వెంటాడుతాయి. రచయిత ఏ నేపథ్యంలోంచి ఈ కథ రాసి వుంటాడా అనే ఊహలు కలుగుతాయి. వాస్తవాల్ని ప్రతీకాత్మకంగా చెప్పడంలో రచయిత అనుసరించిన వ్యూహం ఏమిటనే ఆలోచనలు రేకెతుతాయి. కనుకనే ఒక కథ నుంచి మరో కథలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది. అయితే చదివిన ప్రతి కథ వినూత్న పఠనానుభవానికి లోను చేస్తుంది.
వస్తువులో వైవిధ్యం-కథనంలో సౌందర్యం పాఠకుల్లో హృదయ సంస్కారానికి బాటలు వేసేది నిజమైన కథ. మన కాలానికి అవసరమైన కథ. ఆవేశకావేషాల కన్నా ఆలోచన ప్రధానం. ఆలోచింపజేయడంతో పాటు అంతరాంతరాల్లో మథనానికి లోను చేయడం అవసరం. కలలో మెలకువలో కొన్ని సన్నివేశాలు, కొన్ని పాత్రలు మనల్ని వెంటాడటమన్నది మంచి కథల లక్షణం. లోలోపల తెలియని కలవరానికి లోను చేయడం కథా సంవిధానంలోని సుగుణం. ఇలాంటి కథలే నాలుగు కాలాల పాటు నిలిచిపోతాయి. నలుగురికి గుర్తుండిపోతాయి. ఆయా సందర్భాలకు అనుగుణంగా కథలు, కథల్లోని పాత్రలు స్పురణకొస్తాయి. ఈరీతిన అసంకల్పితంగానే మన అంతరంగాన్ని పట్టి కుదిపే కథలు రాశారు డాక్టర్ ఎమ్.సుగుణరావు. ఇదివరలో అపుడపుడు సుగుణరావు కథలు చదివాను. ఇటీవలి కాలాన | వారి కథలు ఒక్కచోట చదువుతూ వచ్చాను. ఆరునెలల పైబడి ఈ కథలతో ప్రయాణించా. రెండు డజన్ల కథలతో పుస్తకంగా రాబోయే ముందు చదివే అవకాశం రావడం ఆనందదాయకం, చిత్రమైన అనుభూతులకు ఆలవాలం. కథలన్నిటినీ ఏకబిగిన చదవడం కష్టం. అలవోకగా చదవడం కుదరదు. ఒక కథ చదివాక అందులోని పాత్రలు తెలియకనే వెంటాడుతాయి. రచయిత ఏ నేపథ్యంలోంచి ఈ కథ రాసి వుంటాడా అనే ఊహలు కలుగుతాయి. వాస్తవాల్ని ప్రతీకాత్మకంగా చెప్పడంలో రచయిత అనుసరించిన వ్యూహం ఏమిటనే ఆలోచనలు రేకెతుతాయి. కనుకనే ఒక కథ నుంచి మరో కథలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది. అయితే చదివిన ప్రతి కథ వినూత్న పఠనానుభవానికి లోను చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.