ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు. నలు మూలాల వెలుగు రేఖలు విచ్చుకోనే లేదు. చెట్ల మీది పక్షులు ఆహారం కోసం వెళ్ళడానికి రెక్కలు విదుల్చుకోనేలేదు. కానీ మూర్తిగారిల్లు మాత్రం ఎప్పటికన్నా ముందే మేల్కొని సందడిగా ముచ్చటగా ఉంది. మూలుగు, సణుగుడు అంతగా కాకపోతే కనిపించిన వాళ్ళని తిట్టిపోయ్యడం తప్ప నవ్వడం అంతగా తెలియని ఎనభై ఏళ్ల పార్వతమ్మగారు పసిపిల్లలా నవ్వుతూ, కన్నెపిల్లలా ఇల్లంతా కలయ తిరిగేస్తుంది. శ్రీరామచంద్రుడి లాంటి మూర్తి తల్లి ఆనందాన్ని కన్నుల పండువుగా తిలకిస్తున్నారు. ఏదో పనిమీద హడావిడిగా వంటింటి కేసి వెళ్లబోయిన పార్వతమ్మ గారు ఠక్కున ఆగి - ఒరేయ్ మూర్తీ! అరుణ్ గాడు లేచాడ్రా అంది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.