ఇవి ఈ కాలం... సీమ కథలు. ఈ కాలం సీమ కథలు అనడం ఎందుకంటే ఇవి సమకాలీన రాయలసీమ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని పట్టి చూపుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల క్షోభను, ఈ సీమలోకి ప్రజాసముదాయాల బాధలను మన ముందుంచుతున్నాయి. వార్తా దినపత్రికలో ప్రతి మంగళవారం 20 మే 2008 నుంచి 18 నవంబర్ 2009 వరకు వేంపల్లి గంగాధర్ రాసిన కాలం కథల నుంచి ఎంపిక చేసిన లఘు కథలు ఇవి.
ఈ కథల్లో కువైట్ ఇతర ప్రాంతాల వలసల బారిన పడిన కౌలురైతుల కల్లోలం మనకు కన్పిస్తుంది. నకిలీ పాస్ పోర్ట్ లు, ఏజెంట్, సబ్ ఏజెంట్ల మాయాజాలం ఒక వైపు, ఎయిడ్స్ బారిన పడిన తండా బిడికిలా అమ్మాయిల బాధలు, పెద్దోళ్ళ కింద నలిగిపోయే రజకుల కష్టాలు, నాణ్యతలేని విత్తనకాయలు, దక్కని ఎరువులు బారిన బడిన రైతుల గోడు, ప్రాజెక్టుల కింద పునరావాసం లభించని రైతులవ్యథలు మనల్ని వెంటాడుతాయి. ఇక్కడ ఈ సీమలో పంటల్లేవు, పైర్లులేవు, సాగునీరు లేదు. త్రాగు నీరు లేదు. కరెంటు లేదు. గొర్రెలకు దేశాటనం, పశువులకు కబేళాలు, ఇక ప్రభుత్వ పథకాల గుట్టును కూడా గంగాధర్ ఈ కథల్లో రట్టు చేశాడు.
ఇవి ఈ కాలం... సీమ కథలు. ఈ కాలం సీమ కథలు అనడం ఎందుకంటే ఇవి సమకాలీన రాయలసీమ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని పట్టి చూపుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల క్షోభను, ఈ సీమలోకి ప్రజాసముదాయాల బాధలను మన ముందుంచుతున్నాయి. వార్తా దినపత్రికలో ప్రతి మంగళవారం 20 మే 2008 నుంచి 18 నవంబర్ 2009 వరకు వేంపల్లి గంగాధర్ రాసిన కాలం కథల నుంచి ఎంపిక చేసిన లఘు కథలు ఇవి. ఈ కథల్లో కువైట్ ఇతర ప్రాంతాల వలసల బారిన పడిన కౌలురైతుల కల్లోలం మనకు కన్పిస్తుంది. నకిలీ పాస్ పోర్ట్ లు, ఏజెంట్, సబ్ ఏజెంట్ల మాయాజాలం ఒక వైపు, ఎయిడ్స్ బారిన పడిన తండా బిడికిలా అమ్మాయిల బాధలు, పెద్దోళ్ళ కింద నలిగిపోయే రజకుల కష్టాలు, నాణ్యతలేని విత్తనకాయలు, దక్కని ఎరువులు బారిన బడిన రైతుల గోడు, ప్రాజెక్టుల కింద పునరావాసం లభించని రైతులవ్యథలు మనల్ని వెంటాడుతాయి. ఇక్కడ ఈ సీమలో పంటల్లేవు, పైర్లులేవు, సాగునీరు లేదు. త్రాగు నీరు లేదు. కరెంటు లేదు. గొర్రెలకు దేశాటనం, పశువులకు కబేళాలు, ఇక ప్రభుత్వ పథకాల గుట్టును కూడా గంగాధర్ ఈ కథల్లో రట్టు చేశాడు.© 2017,www.logili.com All Rights Reserved.