"రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్లి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకోచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రాదేశిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ కథలు విశ్వకథా సాహిత్యంలో లీనమౌతాయి."
ఈ కథలలోని వస్తువులు వర్తమాన సామాజిక వాస్తవికతను రాయలసీమ నేపథ్యం నుండి విమర్శనాత్మకంగా, కళాత్మకంగా ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు గంగాధర్ ఇదివరకు రాసిన కొన్ని కథల్ని విశ్లేషిస్తాను. 'ఒక జింకల కొండ, ఒక దేవళం చెరువు' కరువు నేపథ్యంలోనూ, 'తూర్పుమండపం', 'నల్లఛత్రి' ఫ్యాక్షన్ నేపథ్యంలోనూ వచ్చిన కథలు. 'హంసనత్తు', 'పూర్ణబింబం' స్త్రీ జీవితం ఆధారంగానూ, 'వాడొక్కడు', 'ఎడారి ఓడ' సామాన్యుల జీవన సమరం ఆధారంగానూ రాసిన కథలు, 'ఏడు తలలనాగు' ఇటీవల ముదిరిపోయిన ధనిక స్వామ్య వ్యవస్థను ప్రతిబింబించే కథ. 'ఉరుసు' ముస్లిం జీవితాన్ని ఆవిష్కరించిన కథ. 'ఆగ్రా టాంగా' విలక్షణమైన, మానవీయాశక్తిగల కథ. వస్తు నవ్యత, వస్తు విలక్షణత ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ కథలు కొన్ని మధ్యతరగతి, ఇంకొన్ని క్రింది తరగతి, మరికొన్ని అదోజగతి జీవిత ప్రతిఫలనాలు.
"రాయలసీమ వాతావరణం కథలలో నేపథ్యమై వాస్తవికతకు దోహదం చేసింది. స్థానిక విశేషాలు పిడికిళ్లి కొలదీ మనకు పరిచయమై ప్రాదేశిక వాస్తవికతను ఆవిష్కరిస్తాయి. సీమ జీవిత మూలాలు కథకుడి దృక్పథం నుండి, అన్వేషణ నుండి దూసుకోచ్చాయి. రాయలసీమ ప్రజల భాష కథలలో పాత్రల భాషగా వినిపించి వస్తువు పట్ల పాఠకులకు హితిని, విశ్వాసాన్ని పెంచుతాయి. ప్రాదేశిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ కథలు విశ్వకథా సాహిత్యంలో లీనమౌతాయి." ఈ కథలలోని వస్తువులు వర్తమాన సామాజిక వాస్తవికతను రాయలసీమ నేపథ్యం నుండి విమర్శనాత్మకంగా, కళాత్మకంగా ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు గంగాధర్ ఇదివరకు రాసిన కొన్ని కథల్ని విశ్లేషిస్తాను. 'ఒక జింకల కొండ, ఒక దేవళం చెరువు' కరువు నేపథ్యంలోనూ, 'తూర్పుమండపం', 'నల్లఛత్రి' ఫ్యాక్షన్ నేపథ్యంలోనూ వచ్చిన కథలు. 'హంసనత్తు', 'పూర్ణబింబం' స్త్రీ జీవితం ఆధారంగానూ, 'వాడొక్కడు', 'ఎడారి ఓడ' సామాన్యుల జీవన సమరం ఆధారంగానూ రాసిన కథలు, 'ఏడు తలలనాగు' ఇటీవల ముదిరిపోయిన ధనిక స్వామ్య వ్యవస్థను ప్రతిబింబించే కథ. 'ఉరుసు' ముస్లిం జీవితాన్ని ఆవిష్కరించిన కథ. 'ఆగ్రా టాంగా' విలక్షణమైన, మానవీయాశక్తిగల కథ. వస్తు నవ్యత, వస్తు విలక్షణత ఈ కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ కథలు కొన్ని మధ్యతరగతి, ఇంకొన్ని క్రింది తరగతి, మరికొన్ని అదోజగతి జీవిత ప్రతిఫలనాలు.© 2017,www.logili.com All Rights Reserved.