నవలా, కథానికా రచయిత్రిగా శ్రీమతి పరిమళా సోమేశ్వర్ వహించిన ప్రఖ్యాతి సాహితీ లోకంలో సుప్రసిద్ధం. ఆనాటి పాఠకులకు ఆమె ఆరాధ్య రచయిత్రి. ఈ కథలన్నీ 1965 - 75 మధ్యకాలంలో వెలువడ్డవే! ఆ రోజుల్లో వీటిని మాస, వార, పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకొని ఆనందించినవే. ఈ సంకలనంలోని కథలన్నీ స్థూలంగా స్త్రీ పురుష సంబంధాలలోని మానవీయత చుట్టూ అల్లుకున్నాయి.
ఇవి చాలావరకు స్త్రీ దృష్టి కోణం నుంచి వచ్చాయి, వెలుగు చూశాయి. స్త్రీ పురుషులు సంప్రదాయ చట్రం నుంచి బైటపడి, మానవీయ భావాజాలం పుణికి పుచ్చుకొని, ఆధునికీకారణం చెందే మార్గంలో నిలవటాన్ని వ్యక్తీకరించే కథానికలివి. అణిగి మణిగి ఉండే స్త్రీ జీవితం జాగరూకమై వంటింటి కుందేలు దశను దాటి, విద్యనార్జించి, ఉద్యోగినిగా మారినా, సమానతా స్థానం ఎక్కినా, స్త్రీ పురుషులు బానిస - యజమాని సంబంధంలోనే మగ్గిపోవాలనే దృష్టిని ఈ కథానికలు ప్రశ్నించాయి.
- కొలకలూరి ఇనాక్ గారు
నవలా, కథానికా రచయిత్రిగా శ్రీమతి పరిమళా సోమేశ్వర్ వహించిన ప్రఖ్యాతి సాహితీ లోకంలో సుప్రసిద్ధం. ఆనాటి పాఠకులకు ఆమె ఆరాధ్య రచయిత్రి. ఈ కథలన్నీ 1965 - 75 మధ్యకాలంలో వెలువడ్డవే! ఆ రోజుల్లో వీటిని మాస, వార, పత్రికల్లో చదువరులు వేడివేడిగా చదువుకొని ఆనందించినవే. ఈ సంకలనంలోని కథలన్నీ స్థూలంగా స్త్రీ పురుష సంబంధాలలోని మానవీయత చుట్టూ అల్లుకున్నాయి. ఇవి చాలావరకు స్త్రీ దృష్టి కోణం నుంచి వచ్చాయి, వెలుగు చూశాయి. స్త్రీ పురుషులు సంప్రదాయ చట్రం నుంచి బైటపడి, మానవీయ భావాజాలం పుణికి పుచ్చుకొని, ఆధునికీకారణం చెందే మార్గంలో నిలవటాన్ని వ్యక్తీకరించే కథానికలివి. అణిగి మణిగి ఉండే స్త్రీ జీవితం జాగరూకమై వంటింటి కుందేలు దశను దాటి, విద్యనార్జించి, ఉద్యోగినిగా మారినా, సమానతా స్థానం ఎక్కినా, స్త్రీ పురుషులు బానిస - యజమాని సంబంధంలోనే మగ్గిపోవాలనే దృష్టిని ఈ కథానికలు ప్రశ్నించాయి. - కొలకలూరి ఇనాక్ గారు© 2017,www.logili.com All Rights Reserved.