గోవిందరాజు రామకృష్ణారావు (జ. 14-11-1929) బి.ఏ., ఎల్ఎల్.ఎం., 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జూనియర్ అనువాదకులుగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద శాఖ డైరెక్టరుగా ఎదిగారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. డా.సి.నారాయణరెడ్డిగారు 1981లో అధికార భాషాసంఘం అధ్యక్షత నుండి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షత వరకు వివిధ పదవులు నిర్వహించినప్పుడు వారి వద్ద సముచిత స్థానంలో పనిచేసి వారి విశేష ఆదరాభిమానాలు చూరగొన్నారు.
వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావుగారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె 'ప్రపంచపదులు', శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు. భారతీయ సాహిత్య పురస్కారాలలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ పొందిన రచయితలను పరిచయం చేస్తూ వీరు జ్ఞానపీఠాలు అనే గ్రంథాన్ని కూడా రచించారు. దీన్ని ఎమెస్కో ప్రచురించింది.
గోవిందరాజు రామకృష్ణారావు (జ. 14-11-1929) బి.ఏ., ఎల్ఎల్.ఎం., 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జూనియర్ అనువాదకులుగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద శాఖ డైరెక్టరుగా ఎదిగారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. డా.సి.నారాయణరెడ్డిగారు 1981లో అధికార భాషాసంఘం అధ్యక్షత నుండి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షత వరకు వివిధ పదవులు నిర్వహించినప్పుడు వారి వద్ద సముచిత స్థానంలో పనిచేసి వారి విశేష ఆదరాభిమానాలు చూరగొన్నారు. వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావుగారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె 'ప్రపంచపదులు', శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు. భారతీయ సాహిత్య పురస్కారాలలో అత్యున్నత పురస్కారం జ్ఞానపీఠ పొందిన రచయితలను పరిచయం చేస్తూ వీరు జ్ఞానపీఠాలు అనే గ్రంథాన్ని కూడా రచించారు. దీన్ని ఎమెస్కో ప్రచురించింది.