పికాసోకి పింక్ పీరియడ్ ఎల్లో పిరియడ్ లున్నయ్. పతంజలికి చేపలు పెంచే పీరియడ్, పిట్టలు పెంచే పీరియడ్, జాతకాలూ ఎస్ట్రాలజీ పీరియడ్ పైకి కనిపించాయి. ఉదయం పత్రిక నుండి బయటికెళ్ళి సొంతపత్రిక పెట్టడం, తిరిగొచ్చి పచ్చళ్ళకొట్టు పెట్టి, అందులో కూచొని ఆస్కార్ వైల్డ్ కంప్లీట్ వర్క్స్ చదువుకుంటుంటే ఫణికుమార్ లాంటి అమాయక సాహిత్యాభిమానులొచ్చి ప్రేమకోసమై పచ్చళ్ళు కొనడం వంటివి కంటికి కనిపించాయి. టాల్ స్టాయ్ రచయిత. మిగతావాళ్ళంతా తక్కువోళ్ళు. ఫలానోడే గాయకుడు అంటూ అర్దరాత్రి పతంజలి పాడిన గద్దర్ పాటలే వినిపించాయి. పతంజలిలా కనిపించిందీ, పతంజలిలా వినిపించిందీ, పతంజలీ చాలా వేరేమో! అందరూ చేసేపనే చేస్తున్నా ఆయన మాత్రం రచన గురించీ రచన కాని దాని గురించీ వంటరిగా వెతుక్కున్నాడు. ఎవరి గురించి ఎవరి దగ్గరికీ వెళ్లి అడిగినా దాఖలాల్లేవు. దారి మధ్య లోకువగా కనిపించిన నామిని సుబ్రమణిలాంటి వాళ్లకి తనకి తెలిసిందో, తెలుసుకున్నా ననుకుందో చెప్పి ఉంటాడంతే.
'గోపి స్మృతి' ఈ కథల్ని వేస్తుందంటే ఎంతో గొప్పనిపిస్తోంది. ఇంతకాలం పతంజలి నవలలూ కథలూ చాలా నాసిగా అనామకంగా అచ్చయ్యాయి, ఒక్కటీ తిన్నగా రాలేదు. పతంజలి కలెక్టడ్ వర్క్స్ ని అందంగా ఎవరైనా తీసుకొస్తే బావుంటుంది. ఎవ్వరూ తీసుకురాపోతే నేనే తీసుకువస్తానని భయంగా ఉంది. ఎందుకంటే పతంజలి లాంటి విస్తృతిగల, తలతిక్క గల ఆలోచన గల, చదవగల, రాయగల పరమ అవకతవక పిచ్చోడు తెలుగు సాహిత్యానికి దొరకడు. అందుకే ఆ మధ్య ఎవరో వచ్చి ఏదో ఆవిష్కరణ సభలో ఆయన పేరు వేయడానికి ముందు జర్నలిస్ట్, ఎడిటర్, నావలిస్ట్, రైటర్ ఎం రాయమంటారంటే ఏదీ వద్దన్నాడాయన పేరు ముందు ఏదీ రాయకుండా ఓన్లీ పతంజలి అని వదిలేయమంటారా అని అడిగితే అవును, 'ఓన్లీ పతంజలి' అని రాయండన్నాడు. నిజమేగా!
- మోహన్
పికాసోకి పింక్ పీరియడ్ ఎల్లో పిరియడ్ లున్నయ్. పతంజలికి చేపలు పెంచే పీరియడ్, పిట్టలు పెంచే పీరియడ్, జాతకాలూ ఎస్ట్రాలజీ పీరియడ్ పైకి కనిపించాయి. ఉదయం పత్రిక నుండి బయటికెళ్ళి సొంతపత్రిక పెట్టడం, తిరిగొచ్చి పచ్చళ్ళకొట్టు పెట్టి, అందులో కూచొని ఆస్కార్ వైల్డ్ కంప్లీట్ వర్క్స్ చదువుకుంటుంటే ఫణికుమార్ లాంటి అమాయక సాహిత్యాభిమానులొచ్చి ప్రేమకోసమై పచ్చళ్ళు కొనడం వంటివి కంటికి కనిపించాయి. టాల్ స్టాయ్ రచయిత. మిగతావాళ్ళంతా తక్కువోళ్ళు. ఫలానోడే గాయకుడు అంటూ అర్దరాత్రి పతంజలి పాడిన గద్దర్ పాటలే వినిపించాయి. పతంజలిలా కనిపించిందీ, పతంజలిలా వినిపించిందీ, పతంజలీ చాలా వేరేమో! అందరూ చేసేపనే చేస్తున్నా ఆయన మాత్రం రచన గురించీ రచన కాని దాని గురించీ వంటరిగా వెతుక్కున్నాడు. ఎవరి గురించి ఎవరి దగ్గరికీ వెళ్లి అడిగినా దాఖలాల్లేవు. దారి మధ్య లోకువగా కనిపించిన నామిని సుబ్రమణిలాంటి వాళ్లకి తనకి తెలిసిందో, తెలుసుకున్నా ననుకుందో చెప్పి ఉంటాడంతే. 'గోపి స్మృతి' ఈ కథల్ని వేస్తుందంటే ఎంతో గొప్పనిపిస్తోంది. ఇంతకాలం పతంజలి నవలలూ కథలూ చాలా నాసిగా అనామకంగా అచ్చయ్యాయి, ఒక్కటీ తిన్నగా రాలేదు. పతంజలి కలెక్టడ్ వర్క్స్ ని అందంగా ఎవరైనా తీసుకొస్తే బావుంటుంది. ఎవ్వరూ తీసుకురాపోతే నేనే తీసుకువస్తానని భయంగా ఉంది. ఎందుకంటే పతంజలి లాంటి విస్తృతిగల, తలతిక్క గల ఆలోచన గల, చదవగల, రాయగల పరమ అవకతవక పిచ్చోడు తెలుగు సాహిత్యానికి దొరకడు. అందుకే ఆ మధ్య ఎవరో వచ్చి ఏదో ఆవిష్కరణ సభలో ఆయన పేరు వేయడానికి ముందు జర్నలిస్ట్, ఎడిటర్, నావలిస్ట్, రైటర్ ఎం రాయమంటారంటే ఏదీ వద్దన్నాడాయన పేరు ముందు ఏదీ రాయకుండా ఓన్లీ పతంజలి అని వదిలేయమంటారా అని అడిగితే అవును, 'ఓన్లీ పతంజలి' అని రాయండన్నాడు. నిజమేగా! - మోహన్© 2017,www.logili.com All Rights Reserved.