ప్రపంచ ప్రేమ కథామాలిక
ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆమె రోజూ నది ఒడ్డుకు వచ్చి కూర్చుంటుంది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని దర్శిస్తుంది. సూర్యభగవానుడిని అర్చిస్తుంది. చిక్కటి చీకటి మాయమై వెలుతురుతో జగతి నిండటం ప్రతిరోజు ఆమెకు ఒక అద్భుతమే. చీకటిని వెలుతురు ఎలా తరుముతుందో చూడాలన్నది ఆమె కోరిక. కానీ ఎంత నిశ్శబ్దంగా వెలుతురు చీకటిని మాయం చేస్తుందంటే, ఆమె కళ్లముందే జరుగుతున్నదాన్ని ఆమె గ్రహించలేకపోతోంది.
చీకటిపడటం కూడా అంతే అద్భుతం అనిపిస్తుంది. ఎలాగయితే చీకటి వెలుగు కౌగిలిలో ఒదిగిపోతుందో అలాగే, వెలుగు కూడా చీకటి కౌగిలిలో ఎలా ఒదుగుతుందో తెలియనంత మృదువుగా ఒదిగిపోతుంది. అయితే ఈ రెండూ కాక ఆమెను ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఆమె దృష్టికి వచ్చింది...
రోజూ వెళ్లే నదీ తీరంలో ఒక మొలక కొత్తగా వచ్చింది! అది ఎటునుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ఆమెకు అర్ధం కాలేదు. చుట్టూ సమతల ప్రదేశం. మరోవైపు
కొండలు... రెంటినీ వేరుచేస్తూ నది.. ఈ కొత్త వింత ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. దానివైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. కాస్సేపటికి ఆమెకు ఓ విషయం అర్థమయింది.
ఈ వింత కూడా తను గమనించలేని రీతిలో ఎదుగుతోంది. అది రోజురోజుకీ ఎదగటం గమనించిందామె.
ఇంతలో ఆమె మరో విషయం గమనించింది. ఎవరో మనిషి దూరంగా నిలబడి ఆమెనే గమనిస్తున్నాడు. అతడిని చూస్తూనే ఆమె హృదయం గమ్మత్తుగా స్పందించింది.
ఎలా ప్రవేశించాయో తెలియకుండా మధుర భావనలు, పులకరింతలు ఆమె శరీరంలోకి ప్రవేశించాయి. అతడివైపు దీర్ఘంగా చూడాలని ఉన్నా, చూడలేక ఆమె తలవంచుకుంది. బుగ్గలు ఎరుపెక్కాయి. అతడి పరిస్థితి ఆమెకు భిన్నంగా లేదు. అతడు ఆమెని సమీపించాడు.
ప్రపంచ ప్రేమ కథామాలిక ప్రేమ రూపు! ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆమె రోజూ నది ఒడ్డుకు వచ్చి కూర్చుంటుంది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని దర్శిస్తుంది. సూర్యభగవానుడిని అర్చిస్తుంది. చిక్కటి చీకటి మాయమై వెలుతురుతో జగతి నిండటం ప్రతిరోజు ఆమెకు ఒక అద్భుతమే. చీకటిని వెలుతురు ఎలా తరుముతుందో చూడాలన్నది ఆమె కోరిక. కానీ ఎంత నిశ్శబ్దంగా వెలుతురు చీకటిని మాయం చేస్తుందంటే, ఆమె కళ్లముందే జరుగుతున్నదాన్ని ఆమె గ్రహించలేకపోతోంది. చీకటిపడటం కూడా అంతే అద్భుతం అనిపిస్తుంది. ఎలాగయితే చీకటి వెలుగు కౌగిలిలో ఒదిగిపోతుందో అలాగే, వెలుగు కూడా చీకటి కౌగిలిలో ఎలా ఒదుగుతుందో తెలియనంత మృదువుగా ఒదిగిపోతుంది. అయితే ఈ రెండూ కాక ఆమెను ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఆమె దృష్టికి వచ్చింది... రోజూ వెళ్లే నదీ తీరంలో ఒక మొలక కొత్తగా వచ్చింది! అది ఎటునుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో ఆమెకు అర్ధం కాలేదు. చుట్టూ సమతల ప్రదేశం. మరోవైపు కొండలు... రెంటినీ వేరుచేస్తూ నది.. ఈ కొత్త వింత ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. దానివైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. కాస్సేపటికి ఆమెకు ఓ విషయం అర్థమయింది. ఈ వింత కూడా తను గమనించలేని రీతిలో ఎదుగుతోంది. అది రోజురోజుకీ ఎదగటం గమనించిందామె. ఇంతలో ఆమె మరో విషయం గమనించింది. ఎవరో మనిషి దూరంగా నిలబడి ఆమెనే గమనిస్తున్నాడు. అతడిని చూస్తూనే ఆమె హృదయం గమ్మత్తుగా స్పందించింది. ఎలా ప్రవేశించాయో తెలియకుండా మధుర భావనలు, పులకరింతలు ఆమె శరీరంలోకి ప్రవేశించాయి. అతడివైపు దీర్ఘంగా చూడాలని ఉన్నా, చూడలేక ఆమె తలవంచుకుంది. బుగ్గలు ఎరుపెక్కాయి. అతడి పరిస్థితి ఆమెకు భిన్నంగా లేదు. అతడు ఆమెని సమీపించాడు.© 2017,www.logili.com All Rights Reserved.