తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నప్పుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వేలుతోందంటే ఇంత బాధగా ఉంటే... మరింక కన్నతండ్రి బాధను ఎవరు చెప్పగలరు అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకునేందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రం సేథ్ రాసిన 'ద సూటబుల్ బాయ్' కథ చదివితే తెలుస్తుంది.
మీ చుట్టూ ఉన్న సమాజంలో మీకు ఎదురైనా, తెలిసిన, విన్న, మీరు చూసిన తండ్రీకూతుళ్ళ గురించి రాయండి. అది మంచైనా, చెడైనా ఫర్లేదు. ఎందుకంటే అందరు తండ్రులు మంచివాళ్ళు, త్యాగమూర్తులు కారు. అలాగే అందరు కూతుళ్ళూ... ఇదేవిధంగా వరుసగా వచ్చిన 24 కథల్లో ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేకుండా మనసు పోరలకు సూటిగా తాకే విధంగా ఉన్నాయి. అందరూ వాస్తవగాథలనే కథలుగా మలిచారు. ఒక కథ చదివితే కంట నీరు ఆగకుంటే, మరొక కథ చదివితే కోపం ప్రజ్వరిల్లక మానదు. ఎందుకంటే ఈ రచనలు అందించిన వారంతా కూతుళ్ళే కాబట్టి ఆ అనుభూతి సజీవంగా తమ అక్షరాల్లో ప్రతిబింబించారు. ఈ కథలన్నీ ఒక ఎత్తైతే, ప్రతి కథకూ మంథా భానుమతిగారు చేసిన విశ్లేషణ మరిన్ని వన్నెలద్దింది.
తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నప్పుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వేలుతోందంటే ఇంత బాధగా ఉంటే... మరింక కన్నతండ్రి బాధను ఎవరు చెప్పగలరు అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకునేందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రం సేథ్ రాసిన 'ద సూటబుల్ బాయ్' కథ చదివితే తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న సమాజంలో మీకు ఎదురైనా, తెలిసిన, విన్న, మీరు చూసిన తండ్రీకూతుళ్ళ గురించి రాయండి. అది మంచైనా, చెడైనా ఫర్లేదు. ఎందుకంటే అందరు తండ్రులు మంచివాళ్ళు, త్యాగమూర్తులు కారు. అలాగే అందరు కూతుళ్ళూ... ఇదేవిధంగా వరుసగా వచ్చిన 24 కథల్లో ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేకుండా మనసు పోరలకు సూటిగా తాకే విధంగా ఉన్నాయి. అందరూ వాస్తవగాథలనే కథలుగా మలిచారు. ఒక కథ చదివితే కంట నీరు ఆగకుంటే, మరొక కథ చదివితే కోపం ప్రజ్వరిల్లక మానదు. ఎందుకంటే ఈ రచనలు అందించిన వారంతా కూతుళ్ళే కాబట్టి ఆ అనుభూతి సజీవంగా తమ అక్షరాల్లో ప్రతిబింబించారు. ఈ కథలన్నీ ఒక ఎత్తైతే, ప్రతి కథకూ మంథా భానుమతిగారు చేసిన విశ్లేషణ మరిన్ని వన్నెలద్దింది.© 2017,www.logili.com All Rights Reserved.