స్వాతంత్ర్య సమర గాథలు వింటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, ఎందరో ధీరమూర్తులు అపారమైన త్యాగాలు చేసి, ప్రాణాలు అర్పించి తెచ్చిన స్వాంతంత్ర్య ఫలాలనే ఇప్పుడు మనం అందుకుని ఆనందిస్తున్నాం. దీని వెనుక ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఈ తరానికి తెలియాలి. ఇళ్ళూ, వాకిళ్ళూ దేశానికి రాసిచ్చిన వాళ్ళు, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలను వదిలి ఉద్యమానికి అంకితమైన వాళ్ళు, కూటికి కటకట లాడుతున్న దేశ భక్తిని వదలని వాళ్ళూ ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు, ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీ దెబ్బలు తిని ఈ స్వేచ్ఛను మనకు సాధించి పెట్టారు.
స్వీయ చరిత్రలు మనకు తక్కువ. జీవిత చరమాంకంలో చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని అప్పటికప్పుడు తన జీవిత చరిత్రలు వ్రాయటానికి పూనుకుంటే అర్థ సత్యాలు చోటు చేసుకునే ప్రమాదం వుంది. సంఘటన జరిగేనాటికీ మనసులో ఉన్న అభిప్రాయానికీ, దాన్ని వ్రాసే నాటికి మనసులో ఉన్న అభిప్రాయానికీ చాలా వ్యత్యాసం వుంటుంది.
- గుత్తికొండ సుబ్బారావు