భారతీయులకు ప్రపంచ ప్రసిద్ధికెక్కిన రెండు గొప్ప ఇతిహాసాలు ఉన్నాయి: వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం. ఆంధ్రులకు ఈ రామాయణ మాహాభారతాలతోపాటు మారో రెండు జాతీయమైన ఉత్తమ ఇతిహాసాలున్నాయి. అవి "పల్నాటి విరచరిత్ర", "కాటమరాజు చరిత్ర ". వీటిని "జానపద ఇతిహాసాలు" అంటారు. 1963 నుండి 1968 వరకు నేను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో "తెలుగు విరగాథకవిత్వం" అనే అంశాన్ని గురించి పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో పల్నాటి విరచరిత్రలో 25 విరగాథలు, కాటమరాజుచరిత్రలో 32 విరగాథలు ఉన్నాయని తెలుసుకున్నాను. కానీ ఇవన్నీ పూర్తిగా నేడు లభించడం లేదు. కాటమరాజుచరిత్రలోని కథలసంఖ్యను గురించి నా సిద్ధాంతగ్రంథంలో వివరించాను.