ఈ సంపుటిలోని చాలా కథలు, కలంతో కాక హృదయంతో చెప్పిన కథలు. 'సంకెళ్ళు' కథ ఈ కోవకి చెందుతుంది. ఓ పోలీస్ ఎస్కార్టు ఇన్ ఛార్జి, కోర్టుకి హాజరు పరిచిన ఒక ముద్దాయి ప్రధాన పాత్రలుగా సాగిన కథ ఇది మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తుంది. చివరిలో అద్భుతమైన వాక్యాలు కథకి నిండుదనాన్ని, బహుమతిని తెచ్చి పెట్టాయి. ఇలాంటి కథ రాయాలంటే రచయిత హోమ్ వర్క్ చెయ్యాలి. ఈ కథ ఆ సంగతిని మనకి గుర్తు చేస్తుంది.
మంజరి గారిలోని విశిష్టత, ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పగలగడం. పదాడంబరాలు లేకుండా వాడుక భాషలో రాయడం. నేల విడిచి సాము చెయ్యని పాత్రలు సృష్టించడం. మానవ సంబంధాల్ని ఉన్నతంగా చూపించడం. వీరి కథలు పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. వీటిలోని పదాలు ఈ రచయిత కన్నీళ్ళని కొన్ని కథలు చదివాక నాకనిపించింది.
- మంజరి