'సరదాగా మరికొంతసేపు' అన్న వుడ్ హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం' కు చెందినవి నాలుగు. వుడ్ హౌస్ అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకున్న 'అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై' అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో 'సోంబాబాయి వలస కాపురం' గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా 'అవతారం' ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్లి ఇరవై పేజీలూ ఒక గంటా వ్యవధిలో 'తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్పూర్తిని, చాకచక్యాన్ని' అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.
'సరదాగా మరికొంతసేపు' అన్న వుడ్ హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం' కు చెందినవి నాలుగు. వుడ్ హౌస్ అభిమానులంతా తమ అభిప్రాయాలను కలగలిపి ఆయన కథల్లో తలమానికంగా ఎన్నుకున్న 'అంకుల్ ఫ్రెడ్ ఫ్లిట్స్ బై' అన్న 1936 నాటి కథ ఈ సంపుటిలో 'సోంబాబాయి వలస కాపురం' గా మొట్టమొదట కనిపిస్తుంది. మాతృకలోని అంకుల్ ఫ్రెడ్ అనుసృజనలో రావుబహదూర్ సోమేశ్వరరావుగా 'అవతారం' ఎత్తుతాడు. తన అబ్బాయి అవతారంతో కలిసి తన చిన్ననాటి ఊరు కుందేరుకు విలాసంగా వెళ్లి ఇరవై పేజీలూ ఒక గంటా వ్యవధిలో 'తన లౌక్యాన్నీ, బుద్ధికుశలతని, సమయస్పూర్తిని, చాకచక్యాన్ని' అలవోకగా ప్రదర్శించి పాఠకులను అలరిస్తాడు.© 2017,www.logili.com All Rights Reserved.