అనువాదాలు చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. అంతకంటె ఎక్కువ గుండెధైర్యం కావాలి. అందులోనూ పి.జి. వుడ్ హౌస్ లాంటి హాస్య రచయితల రచనలు తెలుగులోకి అనువదించటం - అదీ, ఎంతో ముచ్చటగా అనువదించటం - తలపెడితే, దాన్లో ఎదురయ్యే సమస్యలు అన్నీ యిన్నీ కావు. అయినా శ్రీ గబ్బిట కృష్ణమోహన్ ఈ క్లిష్టమైన కార్యాన్ని అలవోకగా - ఒకసారి కాదు, మళ్ళి మళ్ళీ కూడా - విజయవంతంగా నిర్వహించి చూపుతున్నారు.
ఇంతకముందు వుడ్ హౌస్ రాసిన 'ది ఓల్డ్ రిలయబుల్' నవలను 'అపద్భాంధవి ఉరఫ్ పాపాలభైరవి' పేరుతోనూ, ఆయనే రాసిన పది 'మిల్లినర్' కధలను 'సరదాగా కాసేపు' పేరుతోనూ, 'అంకుల్ డైనమైట్' నవలను అదే పేరుతోనూ అనువదించి శ్రీ కృష్ణమోహన్ యిప్పుడు వుడ్ హౌస్ రాసిన మరో నవల 'ఫ్రోజన్ ఎసెట్స్' నవల బ్రిటిష్, అమెరికన్, ప్రెంచ్ జాతీయుల భేషజాలనూ, బలహీనతలనూ విలక్షణంగా చిత్రీకరిస్తుంది. నవలలో వున్న అనేకమైన పెద్దా, చిన్నా పాత్రలన్నీ రచయిత శ్రద్ధగా చెక్కినవే. వుడ్ హౌస్ రచనలు చిత్రమైన హాస్యస్ఫోరకమైన అర్ధాలంకారాలకు, ముఖ్యంగా చిత్రవిచిత్రమైన రూపకాలంకారాలకూ జగత్ప్రసిద్ధం. అలాంటి అలంకారాలను ఈ నవలలో కూడా వుడ్ హౌస్ పుష్కలంగా దట్టించాడు. అలాంటి నవలను పరభాషలోకి అనువదించటం నిజంగా ఒక సాహసమే. మూలంలో బ్రిటిష్, ఫ్రెంచి జాతీయుల మధ్య జరిగిన సన్నివేశాలను తెలుగు - మరాఠీ భాషియుల మధ్య సన్నివేశాలుగా చిత్రించి శ్రీ కృష్ణమోహన్ మూలంలో కనిపించే చమత్కారాన్ని ప్రభావవంతంగా తెలుగులోకి తెచ్చారు.
నేను 'ప్రోజేన్ ఎసెట్స్' నవల ఎన్నోసార్లు చదివి ఆనందించాను. అది నాకు ఎంతో నచ్చిన నవల. ఇప్పుడు కృష్ణమోహన్ గారి యీ అనువాదం నాకు మళ్ళీ అంతగానూ నచ్చింది. ఇంతకంటే ఏం చెప్పను?
- బుర్రా సూర్యప్రకాష్
ఇంపైన వుడ్ హౌసు సొంపైన తెలుగీసు తెలుగు హాస్యప్రియులకు ఇంతకన్న ఆనందమేమి!
- ముళ్ళపూడి వెంకటరమణ
అనువాదాలు చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. అంతకంటె ఎక్కువ గుండెధైర్యం కావాలి. అందులోనూ పి.జి. వుడ్ హౌస్ లాంటి హాస్య రచయితల రచనలు తెలుగులోకి అనువదించటం - అదీ, ఎంతో ముచ్చటగా అనువదించటం - తలపెడితే, దాన్లో ఎదురయ్యే సమస్యలు అన్నీ యిన్నీ కావు. అయినా శ్రీ గబ్బిట కృష్ణమోహన్ ఈ క్లిష్టమైన కార్యాన్ని అలవోకగా - ఒకసారి కాదు, మళ్ళి మళ్ళీ కూడా - విజయవంతంగా నిర్వహించి చూపుతున్నారు. ఇంతకముందు వుడ్ హౌస్ రాసిన 'ది ఓల్డ్ రిలయబుల్' నవలను 'అపద్భాంధవి ఉరఫ్ పాపాలభైరవి' పేరుతోనూ, ఆయనే రాసిన పది 'మిల్లినర్' కధలను 'సరదాగా కాసేపు' పేరుతోనూ, 'అంకుల్ డైనమైట్' నవలను అదే పేరుతోనూ అనువదించి శ్రీ కృష్ణమోహన్ యిప్పుడు వుడ్ హౌస్ రాసిన మరో నవల 'ఫ్రోజన్ ఎసెట్స్' నవల బ్రిటిష్, అమెరికన్, ప్రెంచ్ జాతీయుల భేషజాలనూ, బలహీనతలనూ విలక్షణంగా చిత్రీకరిస్తుంది. నవలలో వున్న అనేకమైన పెద్దా, చిన్నా పాత్రలన్నీ రచయిత శ్రద్ధగా చెక్కినవే. వుడ్ హౌస్ రచనలు చిత్రమైన హాస్యస్ఫోరకమైన అర్ధాలంకారాలకు, ముఖ్యంగా చిత్రవిచిత్రమైన రూపకాలంకారాలకూ జగత్ప్రసిద్ధం. అలాంటి అలంకారాలను ఈ నవలలో కూడా వుడ్ హౌస్ పుష్కలంగా దట్టించాడు. అలాంటి నవలను పరభాషలోకి అనువదించటం నిజంగా ఒక సాహసమే. మూలంలో బ్రిటిష్, ఫ్రెంచి జాతీయుల మధ్య జరిగిన సన్నివేశాలను తెలుగు - మరాఠీ భాషియుల మధ్య సన్నివేశాలుగా చిత్రించి శ్రీ కృష్ణమోహన్ మూలంలో కనిపించే చమత్కారాన్ని ప్రభావవంతంగా తెలుగులోకి తెచ్చారు. నేను 'ప్రోజేన్ ఎసెట్స్' నవల ఎన్నోసార్లు చదివి ఆనందించాను. అది నాకు ఎంతో నచ్చిన నవల. ఇప్పుడు కృష్ణమోహన్ గారి యీ అనువాదం నాకు మళ్ళీ అంతగానూ నచ్చింది. ఇంతకంటే ఏం చెప్పను? - బుర్రా సూర్యప్రకాష్ ఇంపైన వుడ్ హౌసు సొంపైన తెలుగీసు తెలుగు హాస్యప్రియులకు ఇంతకన్న ఆనందమేమి! - ముళ్ళపూడి వెంకటరమణ
© 2017,www.logili.com All Rights Reserved.