ప్రపంచంలో ఏ 'ఒప్పూ' పరిపూర్ణంగా ఉండదు. అలాగే ఏ 'తప్పు' కూడా పరిపూర్ణంగా ఉండదు. పాడయిపోయిన వాచీ కూడా రోజుకి రెండుసార్లు సరయిన కాలాన్ని సూచిస్తుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నవ్యవీక్లీలో 'శుభోదయం' శీర్షికను వారం వారం సంక్షిప్తంగా ప్రముఖుల ప్రవచనాలు ప్రచురిద్దామనుకుని, వారినీ వీరినీ సంప్రదించం. అంతా ఇదిగో పంపుతున్నాం, అదిగో పంపుతున్నాం అన్నవారేగాని, పంపిన ప్రముఖులు లేకపోయారు. పాఠకుల్లో ప్రేరణనీ, స్ఫూర్తినీ కలిగించే నాలుగు ముక్కులు చెప్పండంటే చెప్పేవారే కరువయిపోయారు. ఆ సమయంలో పాలకోడేటి సత్యనారాయాణరావు ఉరఫ్ శ్రీకల్యాణ్ గుర్తొచ్చారు.
కొందరికి సంకల్పశక్తి ఉంటుంది. కొందరికి ఉండదు. సంకల్పశక్తి ఉన్న వ్యక్తీ గొప్పవాడనీ, లేనివాడు అప్రయోజకుడనీ చెప్పడం లేదు. కాకపోతే సంకల్పశక్తి ఉన్న వ్యక్తి మార్పును ఆశిస్తాడు. లేనివాడు మార్పును వద్దనుకుంటాడు. శుభోదయం రాసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి, సంకల్పశక్తితో పాలకోడేటిగారు మార్పును ఆశించారు. వారు ఆశించిన మార్పు పాఠకుల్లో కనిపించింది. శుభోదయం చదవని పాఠకుడు లేడు. ఆ శీర్షికను మెచ్చుకోనీ పాఠకుడు కూడా లేడు. అందుకు వారు అభినందనీయులు. నేనిమిటీ? నేనెవరు? అని ప్రశ్నించుకుంటూ జీవించకండి! జీవించడం ప్రారంభించండి. మీ జీవితమే మిమ్మల్ని నిర్వచిస్తుంది. మీ జీవితమే మీరెవరన్నది తెలియజేస్తుంది. అలా జీవించేందుకు ఈ పుస్తకం మీకు అన్నీ విధాలా సహకరిస్తుందని నమ్ముతూ.......
- జగన్నాథశర్మ
ప్రపంచంలో ఏ 'ఒప్పూ' పరిపూర్ణంగా ఉండదు. అలాగే ఏ 'తప్పు' కూడా పరిపూర్ణంగా ఉండదు. పాడయిపోయిన వాచీ కూడా రోజుకి రెండుసార్లు సరయిన కాలాన్ని సూచిస్తుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే నవ్యవీక్లీలో 'శుభోదయం' శీర్షికను వారం వారం సంక్షిప్తంగా ప్రముఖుల ప్రవచనాలు ప్రచురిద్దామనుకుని, వారినీ వీరినీ సంప్రదించం. అంతా ఇదిగో పంపుతున్నాం, అదిగో పంపుతున్నాం అన్నవారేగాని, పంపిన ప్రముఖులు లేకపోయారు. పాఠకుల్లో ప్రేరణనీ, స్ఫూర్తినీ కలిగించే నాలుగు ముక్కులు చెప్పండంటే చెప్పేవారే కరువయిపోయారు. ఆ సమయంలో పాలకోడేటి సత్యనారాయాణరావు ఉరఫ్ శ్రీకల్యాణ్ గుర్తొచ్చారు. కొందరికి సంకల్పశక్తి ఉంటుంది. కొందరికి ఉండదు. సంకల్పశక్తి ఉన్న వ్యక్తీ గొప్పవాడనీ, లేనివాడు అప్రయోజకుడనీ చెప్పడం లేదు. కాకపోతే సంకల్పశక్తి ఉన్న వ్యక్తి మార్పును ఆశిస్తాడు. లేనివాడు మార్పును వద్దనుకుంటాడు. శుభోదయం రాసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి, సంకల్పశక్తితో పాలకోడేటిగారు మార్పును ఆశించారు. వారు ఆశించిన మార్పు పాఠకుల్లో కనిపించింది. శుభోదయం చదవని పాఠకుడు లేడు. ఆ శీర్షికను మెచ్చుకోనీ పాఠకుడు కూడా లేడు. అందుకు వారు అభినందనీయులు. నేనిమిటీ? నేనెవరు? అని ప్రశ్నించుకుంటూ జీవించకండి! జీవించడం ప్రారంభించండి. మీ జీవితమే మిమ్మల్ని నిర్వచిస్తుంది. మీ జీవితమే మీరెవరన్నది తెలియజేస్తుంది. అలా జీవించేందుకు ఈ పుస్తకం మీకు అన్నీ విధాలా సహకరిస్తుందని నమ్ముతూ....... - జగన్నాథశర్మ© 2017,www.logili.com All Rights Reserved.