ఈ 'సువర్ణరేఖ' కథల సంపుటిలో.. రెండు తలలపాము, మనసులోని మర్మం, మంగళహారతి, అమ్మక్క, నలభీమం, వ్యసనం వంటి కథలు - ఇతివృత్తాలు ఎంచుకోవడంలో జానకీబాల అనుసరించే సూత్రాల్ని పాటిస్తాయి. స్త్రీకి అవసరమైన స్వతంత్ర ప్రవృత్తిని గాఢంగా వాంచిస్తూనే - ఆమెను బంధించి ఉంచే పరిమితుల స్వభావాన్ని విశ్లేషించగల రచయిత్రి జానకీబాల. ఏ రచయితకైనా - ఎన్ని వందల రచనలు చేశామనేది ప్రమాణం కాదు - ఎంతమంది వ్యక్తుల ఆలోచల్ని ప్రేరేపించాయనేది ప్రధానం. జానకీబాల తన చాలా కథల ద్వారా - నవలల ద్వారా ఈ పని చేయగలిగింది. చదివి చూడండి.
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ఇంద్రగంటి జానకీబాల కథల్లో వివిధ అంశాల్ని ప్రస్తావించినా తరచి చూస్తే దాదాపు అనేక కథల్లో స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన సున్నితమైన అనుబంధం, అనురాగం అనేవి వర్తమాన సామాజిక పరిస్థితుల్లో ఎన్ని రంగులుగా మారిపోతున్నాయో, ఎలా మారిపోతున్నాయో, ఎలా చీలిపోతున్నాయో, కనబడని తెరలు వారి మధ్య ఎలాంటి మానసిక వత్తిడికి గురిచేస్తున్నాయో అంతర్లీనంగా, అంతర్ ప్రవాహంగా ఉంటాయి. చాటభారతంలా నిలబెట్టి చెప్పే నీతిబోధలుండవు. సమాజాన్ని ఆదర్శాలతో బాగుచేసేస్తానన్న ధోరణిలో ఉపన్యాసాలూ ఉండవు.
- శీలా సుభద్రాదేవి
ఈ 'సువర్ణరేఖ' కథల సంపుటిలో.. రెండు తలలపాము, మనసులోని మర్మం, మంగళహారతి, అమ్మక్క, నలభీమం, వ్యసనం వంటి కథలు - ఇతివృత్తాలు ఎంచుకోవడంలో జానకీబాల అనుసరించే సూత్రాల్ని పాటిస్తాయి. స్త్రీకి అవసరమైన స్వతంత్ర ప్రవృత్తిని గాఢంగా వాంచిస్తూనే - ఆమెను బంధించి ఉంచే పరిమితుల స్వభావాన్ని విశ్లేషించగల రచయిత్రి జానకీబాల. ఏ రచయితకైనా - ఎన్ని వందల రచనలు చేశామనేది ప్రమాణం కాదు - ఎంతమంది వ్యక్తుల ఆలోచల్ని ప్రేరేపించాయనేది ప్రధానం. జానకీబాల తన చాలా కథల ద్వారా - నవలల ద్వారా ఈ పని చేయగలిగింది. చదివి చూడండి. - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇంద్రగంటి జానకీబాల కథల్లో వివిధ అంశాల్ని ప్రస్తావించినా తరచి చూస్తే దాదాపు అనేక కథల్లో స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన సున్నితమైన అనుబంధం, అనురాగం అనేవి వర్తమాన సామాజిక పరిస్థితుల్లో ఎన్ని రంగులుగా మారిపోతున్నాయో, ఎలా మారిపోతున్నాయో, ఎలా చీలిపోతున్నాయో, కనబడని తెరలు వారి మధ్య ఎలాంటి మానసిక వత్తిడికి గురిచేస్తున్నాయో అంతర్లీనంగా, అంతర్ ప్రవాహంగా ఉంటాయి. చాటభారతంలా నిలబెట్టి చెప్పే నీతిబోధలుండవు. సమాజాన్ని ఆదర్శాలతో బాగుచేసేస్తానన్న ధోరణిలో ఉపన్యాసాలూ ఉండవు. - శీలా సుభద్రాదేవి© 2017,www.logili.com All Rights Reserved.