మాతృబంధం
నులివెచ్చని ఉదయపుటెండలో తలంటుకున్న జుట్టు ఆరబోసుకుంటూ పచార్లు చేస్తోంది అనుపమ. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. చలి విరిగి వేడి పుంజుకుం టోంది. ఆ రోజు శుక్రవారమవడంవల్ల తలంటుకుని, డాబామీద పచార్లు చేస్తూ ఇంటి చుట్టూ అందంగా అమరిన తోటను, పూలను చూస్తోంది అనుపమ.
వెయ్యి గజాల స్థలంలో అత్యంత ఆధునికంగా, కళాత్మకంగా, చూడంగానే మన సంస్కృతి వుట్టిపడేలా వున్న ఆ ఇంట్లో మనుషులు సంబరంగా, నిరాడంబరంగా కనిపిస్తారు.
ఆ వూరుకి పది కిలోమీటర్ల దూరంలో పెద్ద సిటీ వుండడంవల్ల, పట్టణాలలోని సౌకర్యాలకి లోటూ లేదు, పరిసరాలు పచ్చదనానికీ లోటులేదు.
పొలాలూ పుట్రలు, ఇళ్ళూవాకిళ్ళు, ఆవులూ గేదెలూ ఆస్తిపాస్తులుగా గల రాఘవేంద్రరావు ఏకైక సంతానం అనుపమ. మొదట్లో మగపిల్లవాడు లేడని కాస్త బెంగపెట్టుకున్నా, అనుపమ పెరిగేకొద్దీ వారిచింత వదిలేశారు.
రాఘవేంద్రరావు భార్య సావిత్రి చదువుకోకపోయినా సంస్కారం, మంచి హృదయం, దయా, దానం గల మనిషి. అందుకే ఆ చుట్టుపక్కల ఆ ఇంటి సౌభాగ్యాన్ని చూసి ఎక్కువమంది సంతోషపడతారేగానీ ఈర్ష్యపడరు.
కూతురు అనుపమ మరీ సన్నగా వుండదు గానీ, ఆమెని చూసి ఎవ్వరూ లావుగా వుందనలేరు. నిండుగా వుంటుంది. ఆకర్షణీయమైన ముఖంతో దర్జాగా వుంటుంది. పద్ధతులు ఎక్కువగా పల్లెటూరివే.
జరీఅంచు పరికిణీలు, జడగంటలు, కాళ్ళకి మువ్వలపట్టాలు, జూకాలతో చాలా సాధారణ వేషం. ఏదైనా సంబరాలొస్తే, చెంపస్వరాలు, రాళ్ళగాజులు, సూర్యుడు, చంద్రుడు, నాగరం ఇలా ఏవేవో అలంకరిస్తుంది సావిత్రి తన కూతురికి..................
మాతృబంధం నులివెచ్చని ఉదయపుటెండలో తలంటుకున్న జుట్టు ఆరబోసుకుంటూ పచార్లు చేస్తోంది అనుపమ. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. చలి విరిగి వేడి పుంజుకుం టోంది. ఆ రోజు శుక్రవారమవడంవల్ల తలంటుకుని, డాబామీద పచార్లు చేస్తూ ఇంటి చుట్టూ అందంగా అమరిన తోటను, పూలను చూస్తోంది అనుపమ. వెయ్యి గజాల స్థలంలో అత్యంత ఆధునికంగా, కళాత్మకంగా, చూడంగానే మన సంస్కృతి వుట్టిపడేలా వున్న ఆ ఇంట్లో మనుషులు సంబరంగా, నిరాడంబరంగా కనిపిస్తారు. ఆ వూరుకి పది కిలోమీటర్ల దూరంలో పెద్ద సిటీ వుండడంవల్ల, పట్టణాలలోని సౌకర్యాలకి లోటూ లేదు, పరిసరాలు పచ్చదనానికీ లోటులేదు. పొలాలూ పుట్రలు, ఇళ్ళూవాకిళ్ళు, ఆవులూ గేదెలూ ఆస్తిపాస్తులుగా గల రాఘవేంద్రరావు ఏకైక సంతానం అనుపమ. మొదట్లో మగపిల్లవాడు లేడని కాస్త బెంగపెట్టుకున్నా, అనుపమ పెరిగేకొద్దీ వారిచింత వదిలేశారు. రాఘవేంద్రరావు భార్య సావిత్రి చదువుకోకపోయినా సంస్కారం, మంచి హృదయం, దయా, దానం గల మనిషి. అందుకే ఆ చుట్టుపక్కల ఆ ఇంటి సౌభాగ్యాన్ని చూసి ఎక్కువమంది సంతోషపడతారేగానీ ఈర్ష్యపడరు. కూతురు అనుపమ మరీ సన్నగా వుండదు గానీ, ఆమెని చూసి ఎవ్వరూ లావుగా వుందనలేరు. నిండుగా వుంటుంది. ఆకర్షణీయమైన ముఖంతో దర్జాగా వుంటుంది. పద్ధతులు ఎక్కువగా పల్లెటూరివే. జరీఅంచు పరికిణీలు, జడగంటలు, కాళ్ళకి మువ్వలపట్టాలు, జూకాలతో చాలా సాధారణ వేషం. ఏదైనా సంబరాలొస్తే, చెంపస్వరాలు, రాళ్ళగాజులు, సూర్యుడు, చంద్రుడు, నాగరం ఇలా ఏవేవో అలంకరిస్తుంది సావిత్రి తన కూతురికి..................© 2017,www.logili.com All Rights Reserved.