తేయాకు తోటల కార్మికుల నోటి కథలు సేకరించాలన్న ముందస్తు ప్రణాళికతో కాకుండా ఒక సంఘటన ద్వారా 'సామాన్య' తన స్వభావానికి అన్వేషణలో భాగంగా ఈ కృషి చేయడం గమనార్హం. అందుకే ఎన్నో భాషాపరమైన ఇక్కట్లు ఎదుర్కొంటూ తాను అనుకున్నది సాధించింది. పట్టుదల, ఓపిక కేవలం విద్యాత్మక అభిరుచిలోంచి రాదు. ఒక అవసరం, తృష్ణ ఆమెని ముందుకు నడిపింది. ఇంట్లో కూచుని నేర్పుగా రాతబల్ల మీద కథలు రాయడం వేరు. ఆ పని చాలా మంది చేస్తారు.
సామాన్య కూడా కొట్టవచ్చే కథలు కొన్నింటిని రాసి గుర్తింపు పొందింది. భాషకాని భాషలో, లోకానికి అంతగా తెలీని విలక్షణ సంస్కృతిలోంచి, జీవితాలలోంచి అప్పుడే పరిచయమైనా వారిని అక్కున చేర్చుకొని వారి ఆరాటాలను, జీవన పోరాటాలను విని సమయం భారీగానే వెచ్చించి ఈ పని చేసింది. చెప్పే వారి మధ్య, వినే వారి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకొని, వారి అభిమానాన్ని చూరగొంటే తప్ప ఇలాంటి కథలు సేకరించలేం.
తేయాకు తోటల కార్మికుల నోటి కథలు సేకరించాలన్న ముందస్తు ప్రణాళికతో కాకుండా ఒక సంఘటన ద్వారా 'సామాన్య' తన స్వభావానికి అన్వేషణలో భాగంగా ఈ కృషి చేయడం గమనార్హం. అందుకే ఎన్నో భాషాపరమైన ఇక్కట్లు ఎదుర్కొంటూ తాను అనుకున్నది సాధించింది. పట్టుదల, ఓపిక కేవలం విద్యాత్మక అభిరుచిలోంచి రాదు. ఒక అవసరం, తృష్ణ ఆమెని ముందుకు నడిపింది. ఇంట్లో కూచుని నేర్పుగా రాతబల్ల మీద కథలు రాయడం వేరు. ఆ పని చాలా మంది చేస్తారు. సామాన్య కూడా కొట్టవచ్చే కథలు కొన్నింటిని రాసి గుర్తింపు పొందింది. భాషకాని భాషలో, లోకానికి అంతగా తెలీని విలక్షణ సంస్కృతిలోంచి, జీవితాలలోంచి అప్పుడే పరిచయమైనా వారిని అక్కున చేర్చుకొని వారి ఆరాటాలను, జీవన పోరాటాలను విని సమయం భారీగానే వెచ్చించి ఈ పని చేసింది. చెప్పే వారి మధ్య, వినే వారి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పరచుకొని, వారి అభిమానాన్ని చూరగొంటే తప్ప ఇలాంటి కథలు సేకరించలేం.© 2017,www.logili.com All Rights Reserved.