నా కథ మొదలుపెట్టడానికి ముందు ఒక సంగతి చెప్పాలి. నాకు జీవితచరిత్రలు చదవడం చాలా ఇష్టం. అవి, సాధారణ చరిత్రకారులు చెప్పని, చెప్పజాలని సాంఘిక చరిత్రలు చెపుతాయి. చారిత్రకుల దృష్టిలోపడని ఘటనలు, పేర్లు వాటిలో దొరుకుతాయి. తెలుగువారి సాంఘికచరిత్ర వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, టంగుటూరి ప్రకాశం, దర్శి చెంచయ్య, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, ఆదిభట్లనారాయణదాసు, తిరుమలరామచంద్ర వంటి వ్యక్తుల వ్రాతల వల్ల బాగా నాకు అర్థమైంది. ఇలాగే స్వాతంత్రోద్యమంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, ప్రత్యక్షంగా పనిచేసిన వ్యక్తులరచనలు కూడా ఉండి ఉండవచ్చును, కొండా వెంకటప్పయ్య లాగ, శ్రీమతి కొండపల్లి కోటేశ్వరమ్మలాగ!
అయితే నేను ఏ ఉద్యమాలలోనూ పనిచేసినవాడిని కాను. నేనెరిగినది, తెలుగు సాహిత్యం గురించి, అందు నిమిత్తంగా నడిచిన ఘటనల గురించి, ఆధునిక సాహిత్యంతో మా కుటుంబానికున్న సంబంధం గురించి నేనెరిగిన ఘటనలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది.