దార్శనికుడి విశ్వరూప సందర్శనం
నూటయాభై యేళ్ళ క్రితం పుట్టి, తెలుగు సాహిత్యానికి ఓ దశ, దిశ ఏర్పరచి, తాను వచ్చిన పని అయిపోయిందన్నట్టు నూట ఏడేళ్ళ క్రితమే నిష్క్రమించిన గురజాడ అప్పారావుగారి గురించి ఇంకా మనం చర్చించుకుంటున్నామంటే ఆయన ప్రభావం తెలుగు సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేసిందని అర్థం! సమాజానికి రచయితను బాధ్యుడ్ని చేసిన ఘనత ఆయనదే! తన సాహిత్యంలో ఆయన ఆనాడు లేవనెత్తిన అనేక సామాజికాంశాలు ఇప్పటి మన కాలంలో లేకపోయినప్పటికీ ఆయన రచనలు ఈ నాటికీ నవనవోన్మేషంగా నిలిచి ఉన్నాయి. సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే వైద్యుడిగా రచయిత నిలవాలనేది ఆయన తపన. సంస్కరణలే ధ్యేయంగా రచనలు చేసారాయన. సాహిత్యంలో నూతన పోకడలకు నాంది పలికారు. సామాజిక వాస్తవికతకు పెద్ద పీట వేశారు. కథానికా ప్రక్రియకు బీజావాపనం చేసి తొలి కథకుడిగా వాసి కెక్కారు. చలనశీల సాహిత్య స్రష్టగా గురజాడవారిని విమర్శకులు సంభావిస్తారు.
తన సాహిత్యానికి ఆయన ఒక దిశానిర్దేశం చేసుకునే రచనలకు ఉపక్రమించినట్టు శ్రీ గురజాడే స్వయంగా చెప్పుకున్నారు. "జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా కవితారూపాల్లో దాని తత్త్వాన్ని ఈ అన్వయించటానికి ప్రయత్నించాను" అనే వాక్యాలద్వారా గురజాడవారు రచయితలకు నూటపదేళ్ళ క్రితమే చేసిన మార్గదర్శనం గొప్పది. జీవితాన్ని తన కొత్త కోణాలలోంచి రచయిత దర్శించగలగాలి. తాను దర్శించిన దాన్ని కవితాత్మకం లేదా కథాత్మకం చేయగలగాలి. ఆ రచనలో జీవన తత్వాన్ని అన్వయించగలగాలి. ఇది రచయిత బాధ్యత. ఈ మూడు సూత్రాలనూ విస్మరించి రాసే రచనలో తాదాత్మ్యత ఉండదు. ఆర్ద్రత ప్రతిఫలించదు. మనిషి, సమాజమూ, మానవత, మానవీయతలు లేని రచనలకు విలువుండదు...............
దార్శనికుడి విశ్వరూప సందర్శనం నూటయాభై యేళ్ళ క్రితం పుట్టి, తెలుగు సాహిత్యానికి ఓ దశ, దిశ ఏర్పరచి, తాను వచ్చిన పని అయిపోయిందన్నట్టు నూట ఏడేళ్ళ క్రితమే నిష్క్రమించిన గురజాడ అప్పారావుగారి గురించి ఇంకా మనం చర్చించుకుంటున్నామంటే ఆయన ప్రభావం తెలుగు సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేసిందని అర్థం! సమాజానికి రచయితను బాధ్యుడ్ని చేసిన ఘనత ఆయనదే! తన సాహిత్యంలో ఆయన ఆనాడు లేవనెత్తిన అనేక సామాజికాంశాలు ఇప్పటి మన కాలంలో లేకపోయినప్పటికీ ఆయన రచనలు ఈ నాటికీ నవనవోన్మేషంగా నిలిచి ఉన్నాయి. సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే వైద్యుడిగా రచయిత నిలవాలనేది ఆయన తపన. సంస్కరణలే ధ్యేయంగా రచనలు చేసారాయన. సాహిత్యంలో నూతన పోకడలకు నాంది పలికారు. సామాజిక వాస్తవికతకు పెద్ద పీట వేశారు. కథానికా ప్రక్రియకు బీజావాపనం చేసి తొలి కథకుడిగా వాసి కెక్కారు. చలనశీల సాహిత్య స్రష్టగా గురజాడవారిని విమర్శకులు సంభావిస్తారు. తన సాహిత్యానికి ఆయన ఒక దిశానిర్దేశం చేసుకునే రచనలకు ఉపక్రమించినట్టు శ్రీ గురజాడే స్వయంగా చెప్పుకున్నారు. "జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా కవితారూపాల్లో దాని తత్త్వాన్ని ఈ అన్వయించటానికి ప్రయత్నించాను" అనే వాక్యాలద్వారా గురజాడవారు రచయితలకు నూటపదేళ్ళ క్రితమే చేసిన మార్గదర్శనం గొప్పది. జీవితాన్ని తన కొత్త కోణాలలోంచి రచయిత దర్శించగలగాలి. తాను దర్శించిన దాన్ని కవితాత్మకం లేదా కథాత్మకం చేయగలగాలి. ఆ రచనలో జీవన తత్వాన్ని అన్వయించగలగాలి. ఇది రచయిత బాధ్యత. ఈ మూడు సూత్రాలనూ విస్మరించి రాసే రచనలో తాదాత్మ్యత ఉండదు. ఆర్ద్రత ప్రతిఫలించదు. మనిషి, సమాజమూ, మానవత, మానవీయతలు లేని రచనలకు విలువుండదు...............© 2017,www.logili.com All Rights Reserved.