ఆకాశం సిగలో మెర్క్యురీ లైట్ గుచ్చినట్లు చంద్రుడు మేఘాలను చీల్చుకొని వెండి వెలుగుల్ని కురిపిస్తున్నాడు.
దూరంగా సరుగుడు చెట్లలో నుంచి గాలి చేసే వింత శబ్దం పిశాచాల కూనిరాగంలా ఉంది. సరిగ్గా అప్పుడే ఓ నల్లని అంబాసిడర్ కరొకటి తారురోడ్డు వదిలి ఇరుకైన మట్టి బాటలోకి తిరిగింది. దగ్గరలోని సముద్ర కెరటాల హోరులో కారు ఇంజన్ చేసే ధ్వని కలిసిపోయింది.
మట్టిబాట మీద మిట్టపల్లాలను దాటుకుని రాజసౌధం లాంటి అందమైన బిల్డింగ్ ముందాగింది కారు. మరుక్షణం డోర్ ఓ పెన్ చేసుకుని దిగాడో వ్యక్తి. దాదాపు అయిదున్నర అడుగులు ఎత్తు, బలిష్టమైన శరీరం, గాలికి ఎగురుతున్న హెయిర్ స్టయిల్ లో చిన్నసైజు రౌడీలా ఉన్నాడతను. అతని చేతిలో ఓ బ్రీఫ్కేస్ ఉంది.
ఆ బిల్డింగ్ తనకి పరిచితమే అన్నట్టు గేటు తీసుకుని లోపలి నడిచాడు. బిల్డింగ్ ఆవరణలో వరసగా ఉన్న అశోక వృక్షాలు క్రమశిక్షణతో కాపు కాస్తోన్న సైనికుల్లా ఉన్నాయి.
-దుర్గ ప్రసాద్ సర్కార్.
రాత్రి పదకొండుగంటలు ఇరవై నిమీషాలు!