ముగ్గురు కథలు చెప్పేవాళ్ళు ఒకనాడు ఒకచోట కలుసుకున్నారు. ఇంకేముంది? కథలు చెప్పడం మొదలుపెట్టారు. ముగ్గురు ఎంతవరకు వారే మిగతా ఇద్దరికన్నా గొప్ప కథ చెప్పగలము, అనుకున్నారు. మొదటి మనిషి 'నేను చూసిన ఒక సంగతి గురించి కథ చెపుతాను' అన్నాడు. 'ఒకనాడు నేను పొలానికి వెళ్లాను. అక్కడ రెండు పక్షులు కొట్లాడుకుంటూ కనిపించాయి. ఒక పక్షి మరొకదాన్ని మింగేసింది. ఇక ఆ మరోపక్షి మొదటి పక్షిని మింగేసింది. అంటే ఆ పక్షులు రెండు ఒకదాన్ని ఒకటి ఒకటి మింగినయన్న మాట.'
ఇక తరువాతి మనిషి చెప్పసాగాడు. 'ఒకనాడు నేను పొలానికి వెళ్ళాను. దారిలో ఒక మనిషి కనిపించాడు. అతను తన తలను తానూ నరుక్కున్నాడు. ఆ నరికిన తల అతని నోట్లో ఉంది. అతను దాన్ని తింటున్నాడు.' ఇక మూడవ మనిషి చెప్పాడు. 'నేను పెద్ద పాట్నానికి వెళుతున్నాను. అక్కడి నుంచి ఒక ఆడమనిషి ఇటుగా వస్తుండడం చూసాను.
ఆమె తన ఇల్లు, పొలము, మిగతా స్వంత వస్తువులన్నింటినీ తలమీద పెట్టుకుని వస్తున్నది. ఎక్కడికి పోతున్నావని ఆ ఆడమనిషిని నేను అడిగాను. ఆమె ఇంతకుముందు ఎన్నడూ విని ఎరుగని వార్తను విన్నానని చెప్పింది. అది ఏమిటని నేను అడిగాను. ఒక మనిషి తన తలను నరుక్కున్నాడని, ఆ తల నోట్లో పెట్టుకుని తింటున్నాడని వార్త వచ్చిందని ఆమె చెప్పింది. ఆమెకు భయంపుట్టి పట్నం వదిలి పారిపోతున్నదట. ఆమె దారిన ఆమె పోయింది. నా దారిన నేను పోయాను'. ఇంతకూ ఎవరు గొప్ప కథ చెప్పారు? ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ముగ్గురు కథలు చెప్పేవాళ్ళు ఒకనాడు ఒకచోట కలుసుకున్నారు. ఇంకేముంది? కథలు చెప్పడం మొదలుపెట్టారు. ముగ్గురు ఎంతవరకు వారే మిగతా ఇద్దరికన్నా గొప్ప కథ చెప్పగలము, అనుకున్నారు. మొదటి మనిషి 'నేను చూసిన ఒక సంగతి గురించి కథ చెపుతాను' అన్నాడు. 'ఒకనాడు నేను పొలానికి వెళ్లాను. అక్కడ రెండు పక్షులు కొట్లాడుకుంటూ కనిపించాయి. ఒక పక్షి మరొకదాన్ని మింగేసింది. ఇక ఆ మరోపక్షి మొదటి పక్షిని మింగేసింది. అంటే ఆ పక్షులు రెండు ఒకదాన్ని ఒకటి ఒకటి మింగినయన్న మాట.' ఇక తరువాతి మనిషి చెప్పసాగాడు. 'ఒకనాడు నేను పొలానికి వెళ్ళాను. దారిలో ఒక మనిషి కనిపించాడు. అతను తన తలను తానూ నరుక్కున్నాడు. ఆ నరికిన తల అతని నోట్లో ఉంది. అతను దాన్ని తింటున్నాడు.' ఇక మూడవ మనిషి చెప్పాడు. 'నేను పెద్ద పాట్నానికి వెళుతున్నాను. అక్కడి నుంచి ఒక ఆడమనిషి ఇటుగా వస్తుండడం చూసాను. ఆమె తన ఇల్లు, పొలము, మిగతా స్వంత వస్తువులన్నింటినీ తలమీద పెట్టుకుని వస్తున్నది. ఎక్కడికి పోతున్నావని ఆ ఆడమనిషిని నేను అడిగాను. ఆమె ఇంతకుముందు ఎన్నడూ విని ఎరుగని వార్తను విన్నానని చెప్పింది. అది ఏమిటని నేను అడిగాను. ఒక మనిషి తన తలను నరుక్కున్నాడని, ఆ తల నోట్లో పెట్టుకుని తింటున్నాడని వార్త వచ్చిందని ఆమె చెప్పింది. ఆమెకు భయంపుట్టి పట్నం వదిలి పారిపోతున్నదట. ఆమె దారిన ఆమె పోయింది. నా దారిన నేను పోయాను'. ఇంతకూ ఎవరు గొప్ప కథ చెప్పారు? ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.