ఈ సంకలనంలో ఉర్దూతో సహా తొమ్మిది భాషల నుంచి ఇరవయి కత్యలున్నాయి. 160 పుటలలో ఇరవయి కథలంటే అవి మరీ పెద్ద కథలు కాదని అర్థం. అయినా సరే అన్నీ నిజంగా ఆసక్తికరమయిన కథలని హామీ ఇస్తున్నాను. సంకలనంలోని చాలా కథల్లో ఒక రకమయిన హాస్య ధోరణి కనిపిస్తుంది. ప్రతి రచయిత కథలను విస్తారంగా చదివి, అలాంటి కథలను ప్రయత్న పూర్వకంగా ఎంపిక చేశాను. అయితే ఈ కథలన్నింటిలోనూ మనిషి బతుకులోని లోతుగా పాతుకుపోయిన బలమయిన బాధలు తొంగిచూస్తుంటాయి. ఈ కథలలోని ప్రత్యేకతను పాఠకులు ఆదరిస్తారని నా ఆశయం.
సంకలనంలో కనిపించే కొన్ని పేర్లు బహుశా తెలుగు పాఠకులకు తెలియనివి కావచ్చు. ఉదాహరణకు స్వీడిష్ రచయిత షోడెర్ రచనలు ఇంగ్లీషులోనే ఎక్కువ రాలేదు. జోషెంకో గురించి కూడా చాలామందికి తెలియదు. నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ సంకలనంలో ఉన్నారు. తమ దేశం వెలుపల అంతగా తెలియని రచయితలు కూడా ఉన్నారు. ప్రపంచ కథానికా సాహిత్యంలోని ఉత్తమ కథకులను, వారి కథలను తెలుగు పాఠకులకు అందించాలన్నది నా కోరిక.
- కె బి గోపాలం
ఈ సంకలనంలో ఉర్దూతో సహా తొమ్మిది భాషల నుంచి ఇరవయి కత్యలున్నాయి. 160 పుటలలో ఇరవయి కథలంటే అవి మరీ పెద్ద కథలు కాదని అర్థం. అయినా సరే అన్నీ నిజంగా ఆసక్తికరమయిన కథలని హామీ ఇస్తున్నాను. సంకలనంలోని చాలా కథల్లో ఒక రకమయిన హాస్య ధోరణి కనిపిస్తుంది. ప్రతి రచయిత కథలను విస్తారంగా చదివి, అలాంటి కథలను ప్రయత్న పూర్వకంగా ఎంపిక చేశాను. అయితే ఈ కథలన్నింటిలోనూ మనిషి బతుకులోని లోతుగా పాతుకుపోయిన బలమయిన బాధలు తొంగిచూస్తుంటాయి. ఈ కథలలోని ప్రత్యేకతను పాఠకులు ఆదరిస్తారని నా ఆశయం. సంకలనంలో కనిపించే కొన్ని పేర్లు బహుశా తెలుగు పాఠకులకు తెలియనివి కావచ్చు. ఉదాహరణకు స్వీడిష్ రచయిత షోడెర్ రచనలు ఇంగ్లీషులోనే ఎక్కువ రాలేదు. జోషెంకో గురించి కూడా చాలామందికి తెలియదు. నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ సంకలనంలో ఉన్నారు. తమ దేశం వెలుపల అంతగా తెలియని రచయితలు కూడా ఉన్నారు. ప్రపంచ కథానికా సాహిత్యంలోని ఉత్తమ కథకులను, వారి కథలను తెలుగు పాఠకులకు అందించాలన్నది నా కోరిక. - కె బి గోపాలం© 2017,www.logili.com All Rights Reserved.