ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ, ఈ అతీతమైన విషయాలు, శాస్త్రానికి అంతుపట్టని విషయాలు లోకంలో పలుచోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విమర్శలతో నవ్వుకొని, శాస్త్రజ్ఞులమైన మేము మొదట త్రోసిపుచ్చినా, ఏ పరదేశమో వాటిని నిరూపించగానే ఏకీభవించటమేకాక, వారిని ఆకాశానికి ఎత్తుతాము. మనిషిని చంద్రుడి మీద నడిపిస్తాము అని మొదట 'నాసా' వారు అమెరికాలో ఏనాడో బల్లగుద్ది మరీ మరీ చెప్పినా, లోకంలో వారి మాట మొదట ఎవ్వరూ నమ్మలేదు సరికదా త్రోసిపుచ్చి 'ఇదెలా సాధ్యం?' అని పదే పదే వాదించుకున్నారు.
అదే రీతిలో అమెరికా అంగారక గ్రహం మీదికి మరో పదేళ్ళలో పంపగలమని ఇపుడు అంటున్నారు. 'చంద్రుడి మీదికి పంపగల్గినపుడు, అదే రీతిలో అంగారక గ్రహం మీదికి పంపలేమా?' అని ఇప్పుడు అందరు శాస్త్రజ్ఞులు ఏకీభవిస్తున్నారు. విష్ణుశర్మ రాజనీతిని కథారూపంలో రాజకుమారులకు చెప్పి వారిని తీర్చిదిద్దినట్లు మన తెలుగువారికి కూడా శాస్త్రపు పుటలు, కొన్ని అర్థంకానివీ, అతీతమైనవి, నా శక్తిమేరకు కథా రూపంలో చెప్పాలని చేసిన నా ఈ ప్రయత్నాన్ని పాఠకులూ సహృదయంతో స్వీకరిస్తారని విశ్వసిస్తున్నాను.
- డా వక్కలంక వెంకటరమణ
ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ, ఈ అతీతమైన విషయాలు, శాస్త్రానికి అంతుపట్టని విషయాలు లోకంలో పలుచోట్ల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విమర్శలతో నవ్వుకొని, శాస్త్రజ్ఞులమైన మేము మొదట త్రోసిపుచ్చినా, ఏ పరదేశమో వాటిని నిరూపించగానే ఏకీభవించటమేకాక, వారిని ఆకాశానికి ఎత్తుతాము. మనిషిని చంద్రుడి మీద నడిపిస్తాము అని మొదట 'నాసా' వారు అమెరికాలో ఏనాడో బల్లగుద్ది మరీ మరీ చెప్పినా, లోకంలో వారి మాట మొదట ఎవ్వరూ నమ్మలేదు సరికదా త్రోసిపుచ్చి 'ఇదెలా సాధ్యం?' అని పదే పదే వాదించుకున్నారు. అదే రీతిలో అమెరికా అంగారక గ్రహం మీదికి మరో పదేళ్ళలో పంపగలమని ఇపుడు అంటున్నారు. 'చంద్రుడి మీదికి పంపగల్గినపుడు, అదే రీతిలో అంగారక గ్రహం మీదికి పంపలేమా?' అని ఇప్పుడు అందరు శాస్త్రజ్ఞులు ఏకీభవిస్తున్నారు. విష్ణుశర్మ రాజనీతిని కథారూపంలో రాజకుమారులకు చెప్పి వారిని తీర్చిదిద్దినట్లు మన తెలుగువారికి కూడా శాస్త్రపు పుటలు, కొన్ని అర్థంకానివీ, అతీతమైనవి, నా శక్తిమేరకు కథా రూపంలో చెప్పాలని చేసిన నా ఈ ప్రయత్నాన్ని పాఠకులూ సహృదయంతో స్వీకరిస్తారని విశ్వసిస్తున్నాను. - డా వక్కలంక వెంకటరమణ© 2017,www.logili.com All Rights Reserved.