Hamsa Vimshati Vignana Sarvasvamu

Rs.500
Rs.500

Hamsa Vimshati Vignana Sarvasvamu
INR
MANIMN5012
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

హంసవింశతి: కావ్యము- కవి

కథా కావ్యము

సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. 'కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు.

కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి.

తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి.

కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది..................

హంసవింశతి: కావ్యము- కవి కథా కావ్యము సంస్కృత, ప్రాకృత వాఙ్మయ చరిత్రను పరిశీలిస్తే దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే కథా కావ్యాలు వెలిసియున్నట్లు తెలుస్తున్నది. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో రచించిన బృహత్కథ రెండు వేల సంవత్సరాల నాటిదని పండితుల అభిప్రాయం. బృహత్కథ ఆధారంగా సోమదేవుడు కథా సరిత్సాగరాన్ని, క్షేమేంద్రుడు బృహత్కథా మంజరిని రచించి యున్నారు. ఇవి గాక పంచతంత్ర హితోపదేశాలు, బుద్ధుని జాతక కథలు, కాదంబరి, దశకుమార చరిత్ర మొదలైన కథా కావ్యాలెన్నో, ఏనాడో సంస్కృత ప్రాకృతాలందు వెలసి యున్నవి. 'కొన్ని పద్యకథా కావ్యాలు కాగా, మరికొన్ని వచన రచనలు. కానీ ప్రాచీన కాలమున తెలుగులో వచన కథా కావ్యాలు కనిపించుట లేదు. దండి దశకుమార చరిత్రను సంస్కృత వచనంలో వ్రాసి యుండగ, దానినాంధ్రీకరించిన కేతన తెలుగులో పద్య కథా కావ్యంగా తీర్చి దిద్దారు. తిక్కన ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. కథాకావ్యాలే గాక వ్యాకరణాలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ ఆ కాలంలో పద్య రూపంలోనే రచించుట గమనించ దగ్గ విషయం. ఇది కారణంగా మన ప్రాచీన కథాకావ్యాలన్ని పద్య రూపంలోనే వెలువడి ఉన్నాయి. తెలుగు సాహిత్యం దాదాపు వెయ్యేండ్లుగా సాగుతూ వస్తున్నది. ఇందులో ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రియలెన్నో వెలసి ఉన్నాయి. వాటిలో కథా కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథా కావ్యాల్లో కొన్ని అనువాదాలు, అనుకరణలు కాగా మరికొన్ని స్వతంత్ర రచనలై ఉన్నాయి. కేతన కృతమగు దశకుమార చరిత్ర, వేంకటనాథుడు రచించిన పంచతంత్రం (దీనినే నారాయణకవి, భావయ కవి వేర్వేరుగా రచించి యున్నారు). కొఱవి గోపరాజు నిర్మించిన సింహాసన ద్వాత్రింశిక, మంచన వ్రాసిన కేయూర బాహు చరిత్ర, వెన్నెలకంటి అన్నయామాత్యుని షోడశకుమార చరిత్ర, జక్కన కృతమగు విక్రమార్కు చరిత్ర, అనంతామాత్యుని భోజరాజీయము, కూచిరాజు ఎఱ్ఱన విరచించిన సకల కథా నిధానము, పుత్తేటి రామభద్రుని కథాసార సంగ్రహము, చింతలపూడి ఎల్లనార్యుని (రాధా మాధవకవి) విష్ణుమాయా నాటకము, పాలవేకరి కదిరీపతి రచించిన శుకసప్తతి, అయ్యలరాజు నారాయణా మాత్యుని హంస వింశతి మొదలైనవి తెలుగు పద్య కథా కావ్యాల్లో పేర్కొనదగినవి. అందులోను శుకసప్తతి, హంస వింశతి జారశృంగార కథలు వస్తువుగా ఒకే కోవకు చెందిన శృంగార ప్రబంధాలుగా వన్నెకెక్కినవి. శుక సప్తతి, నాటి సమాజానికి నిలువుటద్దము నెత్తగా, హంసవింశతి. నాటి సమాజంలోని శాస్త్రాద్యనేక విషయాలు ప్రస్తావించి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు గల కథా ప్రబంధంగా పరిగణింపబడుచున్నది..................

Features

  • : Hamsa Vimshati Vignana Sarvasvamu
  • : Dr Gunji Venkataratnam
  • : Emesco Books pvt.L.td.
  • : MANIMN5012
  • : Paperback
  • : Dec, 2023
  • : 512
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hamsa Vimshati Vignana Sarvasvamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam