కథలకడలి మథనం
అప్పలస్వామి (13.11.1904
ఉత్తరాంధ్ర, సాహితీవేత్తల్లో పురిపండా 18.11.1982) అగ్రగణ్యుల్లో ఒకడు. తాపీ ధర్మారావుతో కలిసి పనిచేశాడు. క్యావహారిక భాషను అందలాలెక్కించాలని జీవితాంతం కృషి చేశాడు. శ్రీశ్రీ, చాసో, Mana ఆరుద్ర, శ్రీరంగం నారాయణ బాబు లాంటి పలువురు విజయనగరం,
రచయితల్లో తలమానికంగా ఉన్నవాడు. ఆనాడు పలువురు రచయితలను కూడగటి విశాఖలో కవితా సమితి స్థాపకుల్లో ఒకడు. ఒరియా, హిందీ, ఇంగ్లీషులాంటి పలు భాషలు నేర్చినవాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కోసం అనేక సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. అన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షవర అధ్యక్షుడుగా జీవితాంతం ఉండి అనేక మంది యువ రచయితలకు పేరణగా నిలిచినవాడు. 'పులిపంజా' కవితా సంకలనంతో ఆధునిక సాహిత్యకారుల్లో మొదటి పేజీన నిలిచిన వ్యక్తి.
1955లో అద్దేపల్లి ప్రచురణల వారి ప్రోత్సాహంతో విశ్వకథావీధి అంటూ సుమారు 7 కథల సంకలనాలకు అప్పలస్వామి సంపాదకత్వం వహించాడు. ప్రపంచ ప్రసిద్ధ రచయితల కథలను పరిశీలించి మేలైన వాటిని తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యాలన్న తపనతో పురిపండా దీనికి పూనుకున్నాడు. సరళమైన వచనంలో - అదీ ప్రజల వాడుకభాషలో అనువాదం సాగింది. పాత్రల పేరు ఆయా దేశాలకే ఉంచుతూ పరిసరాలను వర్ణనలను తెలుగు వాళ్ళకు సుబోధకంగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. పాఠకులకు ఇవి అనువాదాలుగా కాకుండా తెలుగువాడే తెలుగులో రాసిన మూల రచనలుగా కనబడటం పురిపండా అనువాద నైపుణ్యానికి తార్కాణం. ..
నవచేతనకు లభించిన మేరకు మొదటి సంకలనం 2,3,4 సంకలనాలను ప్రచురిస్తున్నాం. మిగిలిన భాగాలు లభించిన వెంటనే 'విశ్వకథావీధి' 2వ సంకలనం
పురిపండా అప్పలస్వామి విశ్వకథావీథి ప్రచురించగలం. వీటి సేకరణలో మిత్రుడు యామిజాల ఆనంద్, నరేందర్ గార్ల తోడ్పాటుకు కృతజ్ఞతలు.
1955 తర్వాత వాటి పునర్ముద్రణ జరిగిన దాఖలా లేదు. ఇంతకాలానికి 'విశ్వకథావీధి' 1వ సంకలనం పాఠకులకందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పాఠకులు ఈ సంకలనాన్ని ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది.
ఎన్. మధుకర్ కార్యనిర్వాహక సంపాదకులు నవచేతన పబ్లిషింగ్ హౌస్
హైదరాబాద్
ఏప్రిల్, 2018
© 2017,www.logili.com All Rights Reserved.