అమ్మ
పల్చని చెట్లవరస దాటాక విశాలమైన బయలు. దానికవతల పశ్చిమ దిక్కులో గ్రామం. ఊరిదగ్గర చెట్లు పొడవాటి కొమ్మలు చలికి ఊగులాడుతూ ఉన్నాయి. చెట్లలో ఒక ఇంటివాకిలి సున్నపుగోడ ఏదో విషణ్ణంగా ఉంది. చలికి మరింత పాలిపోయింది దాని బొల్లి రంగు. వాతావరణం నలుదిక్కులా మృత్యువు నీడలను అనుభవానికి తెస్తున్నట్లుగా ఉంది.
ఊరి చివర పురాతనమైన ఒక చీకటికొంప పెగోడా వలె ఉంది. మసక మసక దీపంతో, తోడులేని ఏకాకి వృద్ధుడు విషాదంగా దూరాన్ని పరికిస్తూ ఉన్నట్లుందా
ఇల్లు.
సాయంసంధ్య ఆక్రమిస్తూ ఉంది. ఊరి కొంపలనుండి ఇవాళ అధికంగా పొగలు లేవడం లేదు. నిశ్శబ్దమైన సాయం ప్రసన్నత గ్రామాన్ని కప్పుతూ ఉంది. కాకులు చిన్న చిన్న గుంపులుగా, తలమీద చక్రాకారంగా ఎగురుతూ ఖర్జూరవనం దిక్కు వెళ్లిపోతూ ఉన్నాయి. అంతకుముందే ఖర్జూర వృక్షాలను ఆశ్రయించుకున్న చిన్నరకం పిట్టలు ఈ ఆగంతుకుల్ని చూసి భయంతో కిచకిచలాడుతున్నాయి.
ఇంతలో ఒక పెద్ద నీడ బరువైన పాదాలు వేసుకొంటూ కొండమీదినుండి దిగిరావడం చూసి పక్షలన్నీ మరింత భయపడ్డాయి. ఆ పాదాలకు తొడిగి ఉన్న నాళ్లు వేసిన నల్లని జోళ్ల బరువుకు గడ్డిమీది పల్చటి మంచుముక్కలు పిండి పిండి ఐపోతున్నవి. చిత్రమైన జుత్తు కలిగిన ఒక అడవికోడి భయంతో పారిపోయి తుప్పలో...............
అనువాద సాహిత్యం
బాలా పుస్తక ప్రచురణలు
అమ్మ పల్చని చెట్లవరస దాటాక విశాలమైన బయలు. దానికవతల పశ్చిమ దిక్కులో గ్రామం. ఊరిదగ్గర చెట్లు పొడవాటి కొమ్మలు చలికి ఊగులాడుతూ ఉన్నాయి. చెట్లలో ఒక ఇంటివాకిలి సున్నపుగోడ ఏదో విషణ్ణంగా ఉంది. చలికి మరింత పాలిపోయింది దాని బొల్లి రంగు. వాతావరణం నలుదిక్కులా మృత్యువు నీడలను అనుభవానికి తెస్తున్నట్లుగా ఉంది. ఊరి చివర పురాతనమైన ఒక చీకటికొంప పెగోడా వలె ఉంది. మసక మసక దీపంతో, తోడులేని ఏకాకి వృద్ధుడు విషాదంగా దూరాన్ని పరికిస్తూ ఉన్నట్లుందా ఇల్లు. సాయంసంధ్య ఆక్రమిస్తూ ఉంది. ఊరి కొంపలనుండి ఇవాళ అధికంగా పొగలు లేవడం లేదు. నిశ్శబ్దమైన సాయం ప్రసన్నత గ్రామాన్ని కప్పుతూ ఉంది. కాకులు చిన్న చిన్న గుంపులుగా, తలమీద చక్రాకారంగా ఎగురుతూ ఖర్జూరవనం దిక్కు వెళ్లిపోతూ ఉన్నాయి. అంతకుముందే ఖర్జూర వృక్షాలను ఆశ్రయించుకున్న చిన్నరకం పిట్టలు ఈ ఆగంతుకుల్ని చూసి భయంతో కిచకిచలాడుతున్నాయి. ఇంతలో ఒక పెద్ద నీడ బరువైన పాదాలు వేసుకొంటూ కొండమీదినుండి దిగిరావడం చూసి పక్షలన్నీ మరింత భయపడ్డాయి. ఆ పాదాలకు తొడిగి ఉన్న నాళ్లు వేసిన నల్లని జోళ్ల బరువుకు గడ్డిమీది పల్చటి మంచుముక్కలు పిండి పిండి ఐపోతున్నవి. చిత్రమైన జుత్తు కలిగిన ఒక అడవికోడి భయంతో పారిపోయి తుప్పలో............... అనువాద సాహిత్యం బాలా పుస్తక ప్రచురణలు© 2017,www.logili.com All Rights Reserved.