తల్లిదండ్రులు ముద్దారగా బెట్టిన పేరు యావన్మందికీ తెలిసిందే - జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి. జగమెరిగిన బ్రాహ్మణుడు. ఎటోచ్చీ తన మిత్ర కొ(తి)టి కి తన పేరు విరిచి, తెంచి, మార్చి, కూర్చే చనువు తానుగా యిచ్చిందే. తన పేరు తానే మరిచిన ఈగలాగ రుక్మిణినాధశాస్త్రి లెక్కలేనన్ని మారుపేర్లు పెట్టుకున్నాడు. వాటిలో ఆప్తులకు గూడా అన్నీ తెలీవు. జయంతి కుమారస్వామి, వెల్లటూరి సోమనాధం, చలికాలం మార్తండరావు, యిలా యెన్నో! కొన్నింటికి ఉన్న అవసరం అన్నిటికీ ఉందని చెప్పడం కష్టం. అదో సరదా. అంతే. రుక్మిణినాధశాస్త్రి రుక్కాయి, జలాలుద్దీన్ రూమీ, రుక్కుటేశ్వరుడు అనిపించుకున్నాడు. అదో ముచ్చట. ఆయనకే తగింది.
పత్తి విడుతూ
కత్తి పడతా !
కలం పట్టుకు
కిలం పట్టిన
పాతమాటల
కోటలన్నీ
కూల్చివేస్తాను !
కుంచెపట్టుకు మనోవీధిని
సంచరించే స్వప్న సౌఖ్యం
పత్ర పత్రంలోన 'ఫస్టు' గ
చిత్రముల్ రాస్తా
రెడ్డిగం వేసేటి కూళల
మడ్డిమాటలు, మాయమాటలు
కల్లబొల్లీ, కాలవాహిని
కలిపివేస్తాను
తెగువ తెచ్చుకు
చేగ తెచ్చుకు
దేశమంతా తిరిగి తిరిగీ
వ్యక్తికి వ్యక్తికీ మధ్యా
వెలుగునిచ్చేస్తాన్ !
ఆర్తులను కాపాడుతానూ
కార్తవీర్యార్జునుణౌతా
'చచ్చు' సిద్ధాంతములు కాల్చుకు
స్వర్గధామము కట్టుతా
'పత్తి' గాంధిజీ ఖద్దరుకి సంకేతమని భావించడం, గాంధేయపంధా వదిలి వ్యష్టి సత్యాగ్రహం కాలంలో పోరాటపంధాకు తిరిగే మనస్థితిని ఈ గేయం సూచిస్తున్నది. ఈ విధంగా జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి సరళి తాలుకా ఉంటుంది.
- జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి
తల్లిదండ్రులు ముద్దారగా బెట్టిన పేరు యావన్మందికీ తెలిసిందే - జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి. జగమెరిగిన బ్రాహ్మణుడు. ఎటోచ్చీ తన మిత్ర కొ(తి)టి కి తన పేరు విరిచి, తెంచి, మార్చి, కూర్చే చనువు తానుగా యిచ్చిందే. తన పేరు తానే మరిచిన ఈగలాగ రుక్మిణినాధశాస్త్రి లెక్కలేనన్ని మారుపేర్లు పెట్టుకున్నాడు. వాటిలో ఆప్తులకు గూడా అన్నీ తెలీవు. జయంతి కుమారస్వామి, వెల్లటూరి సోమనాధం, చలికాలం మార్తండరావు, యిలా యెన్నో! కొన్నింటికి ఉన్న అవసరం అన్నిటికీ ఉందని చెప్పడం కష్టం. అదో సరదా. అంతే. రుక్మిణినాధశాస్త్రి రుక్కాయి, జలాలుద్దీన్ రూమీ, రుక్కుటేశ్వరుడు అనిపించుకున్నాడు. అదో ముచ్చట. ఆయనకే తగింది. పత్తి విడుతూ కత్తి పడతా ! కలం పట్టుకు కిలం పట్టిన పాతమాటల కోటలన్నీ కూల్చివేస్తాను ! కుంచెపట్టుకు మనోవీధిని సంచరించే స్వప్న సౌఖ్యం పత్ర పత్రంలోన 'ఫస్టు' గ చిత్రముల్ రాస్తా రెడ్డిగం వేసేటి కూళల మడ్డిమాటలు, మాయమాటలు కల్లబొల్లీ, కాలవాహిని కలిపివేస్తాను తెగువ తెచ్చుకు చేగ తెచ్చుకు దేశమంతా తిరిగి తిరిగీ వ్యక్తికి వ్యక్తికీ మధ్యా వెలుగునిచ్చేస్తాన్ ! ఆర్తులను కాపాడుతానూ కార్తవీర్యార్జునుణౌతా 'చచ్చు' సిద్ధాంతములు కాల్చుకు స్వర్గధామము కట్టుతా 'పత్తి' గాంధిజీ ఖద్దరుకి సంకేతమని భావించడం, గాంధేయపంధా వదిలి వ్యష్టి సత్యాగ్రహం కాలంలో పోరాటపంధాకు తిరిగే మనస్థితిని ఈ గేయం సూచిస్తున్నది. ఈ విధంగా జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి సరళి తాలుకా ఉంటుంది. - జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.