ఆద్యంతం చదివించేలా ఉన్న ఈ పుస్తకంలో ఈ సమాజవాద నాయకత్రయం జీవితపు ఘట్టాలను చదివినప్పుడు మన ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అత్యంత సరళమైన భాషలో వైఎల్పీ వారి జీవితపు ఘట్టాలతో పాటు ఒక ఆరుదశాబ్దాల సామాజిక, రాజకీయ చరిత్రను రికార్డు చేశారు. చరిత్రలో మరుగునపడిపోతాయనుకున్న ఘటనల్ని మన కళ్ళముందుంచి మనను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అలాంటి నాయకులు మనలోంచే రావాలన్న భావన ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. రాజకీయ విశ్లేషకుడుగా, సాహితీ వేత్తగా, హిందీ, తెలుగుభాషల్లో పట్టు ఉన్న పండితుడుగా, అనర్గళంగా, అర్థవంతంగా మాట్లాడగలిగిన వక్తగా గుర్తింపు పొందిన వైఎల్పీ కీర్తి కిరీటంలో ఈ పుస్తకం మరో కలికితురాయి.
ఆద్యంతం చదివించేలా ఉన్న ఈ పుస్తకంలో ఈ సమాజవాద నాయకత్రయం జీవితపు ఘట్టాలను చదివినప్పుడు మన ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అత్యంత సరళమైన భాషలో వైఎల్పీ వారి జీవితపు ఘట్టాలతో పాటు ఒక ఆరుదశాబ్దాల సామాజిక, రాజకీయ చరిత్రను రికార్డు చేశారు. చరిత్రలో మరుగునపడిపోతాయనుకున్న ఘటనల్ని మన కళ్ళముందుంచి మనను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ అలాంటి నాయకులు మనలోంచే రావాలన్న భావన ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. రాజకీయ విశ్లేషకుడుగా, సాహితీ వేత్తగా, హిందీ, తెలుగుభాషల్లో పట్టు ఉన్న పండితుడుగా, అనర్గళంగా, అర్థవంతంగా మాట్లాడగలిగిన వక్తగా గుర్తింపు పొందిన వైఎల్పీ కీర్తి కిరీటంలో ఈ పుస్తకం మరో కలికితురాయి.© 2017,www.logili.com All Rights Reserved.