"విశ్వములో తిరుగాడుతున్న భూగోళం గురించి, మానవ జాతిని గురించి చర్చించడం ఎట్లాంటిదో ఈనాడు షేక్స్పియర్ ను గురించి చర్చించడం అట్లాంటిది." షేక్స్పియర్ 400 వ జన్మదినోత్సవం సందర్భంగా బి.బి.,సి.లో ప్రసంగిస్తూ, విమర్శకుడు వి.ఎస్. ప్రిచెట్ చెప్పిన మాటలు . ఒక్క పాశ్చాత్య దేశాలో కాకుండా, ప్రపంచంలో అన్ని దేశాలు ఈ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాయి. ఇంతటి ఖ్యాతి మారె కవికి సమకూరలేదు, షేక్స్పియర్ ని గురించి రాసినన్ని పుస్తకాలు మారె కవిని గురించి రాయబడలేదు. ప్రతినెలా షేక్స్పియర్ ని గురించి ఒక వ్యాసమో ఒక పుస్తకమో వెలువడుతూనే వుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు ఆయన్ని గురించి రాయడంలో నిమగ్నులై ఉన్నారనడం ఆతిశయోక్తి కాదు. షేక్స్పియర్ ని గురించి రాయడం నాగరిక ప్రపంచానికి ఒక తీరిక సమాయపు వ్యాపకం అయిపోయిందన్నారెవరో.