శతక వాజ్మయంలో వేమన్నది అగ్రస్థానం. అలతిఅలతి పదాలతో, అనన్య సామాన్యమైన పోలికలతో, అమూల్యమైన అంశాలతో ‘విశ్వదాభిరామ వినురవేమ! అనే ప్రజారంజకమైన మకుటంతో తాను రచించిన వేలాది పద్యాలను తెలుగుభాషామతల్లికి అమూల్యమైన కంఠాభరణంగా అలంకరించిన ప్రజాకవి, వేదాంతకవి, నీతికవి, ప్రగతిశీలుడు వేమన్న. రెండువైపులా పదునుగల చురకత్తి వంటి కవితాశక్తితో పాదత్రయంలోనే పద్యసారాన్నంతా ఇమిడ్చిన మహాకవి! తెలుగు భాషకు పడుతున్న గ్రహణం కారణంగా పద్యాల ప్రాచుర్యం ఈనాడు తగ్గుతున్న మాట వాస్తవం.
అందుకే, ప్రజాహృదయాల్ని చూరగొన్న ఆణిముత్యాలవంటి ఈ వేమన నీతిపద్యాలలో కొన్ని ఎన్నుకుని, వాటికి తగినట్లు సమకాలీన సంఘటనలాధారంగా తెలుగు పాఠకులకు ఆహ్లాదం, మానసిక వికాసం కలిగించే ఉద్దేశంతో హాస్యం, వ్యంగ్యం మేళవించి కార్టూన్లు గీశాను. ఆ పద్య వ్యంగ్యచిత్రాలు ఉత్తమాభిరుచిగల పాఠకులకు చేరువకావాలనే సదాశయంతోనే పుస్తకరూపంలో తీసుకొస్తున్నాను. వీటిలో కొన్ని కార్టూన్లను పాతికేళ్ళ కిందట నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ వారు ప్రముఖ వారపత్రికలలో ప్రచురింపజేశారు. వారికి, ప్రచురించిన పత్రికల వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.
శతక వాజ్మయంలో వేమన్నది అగ్రస్థానం. అలతిఅలతి పదాలతో, అనన్య సామాన్యమైన పోలికలతో, అమూల్యమైన అంశాలతో ‘విశ్వదాభిరామ వినురవేమ! అనే ప్రజారంజకమైన మకుటంతో తాను రచించిన వేలాది పద్యాలను తెలుగుభాషామతల్లికి అమూల్యమైన కంఠాభరణంగా అలంకరించిన ప్రజాకవి, వేదాంతకవి, నీతికవి, ప్రగతిశీలుడు వేమన్న. రెండువైపులా పదునుగల చురకత్తి వంటి కవితాశక్తితో పాదత్రయంలోనే పద్యసారాన్నంతా ఇమిడ్చిన మహాకవి! తెలుగు భాషకు పడుతున్న గ్రహణం కారణంగా పద్యాల ప్రాచుర్యం ఈనాడు తగ్గుతున్న మాట వాస్తవం. అందుకే, ప్రజాహృదయాల్ని చూరగొన్న ఆణిముత్యాలవంటి ఈ వేమన నీతిపద్యాలలో కొన్ని ఎన్నుకుని, వాటికి తగినట్లు సమకాలీన సంఘటనలాధారంగా తెలుగు పాఠకులకు ఆహ్లాదం, మానసిక వికాసం కలిగించే ఉద్దేశంతో హాస్యం, వ్యంగ్యం మేళవించి కార్టూన్లు గీశాను. ఆ పద్య వ్యంగ్యచిత్రాలు ఉత్తమాభిరుచిగల పాఠకులకు చేరువకావాలనే సదాశయంతోనే పుస్తకరూపంలో తీసుకొస్తున్నాను. వీటిలో కొన్ని కార్టూన్లను పాతికేళ్ళ కిందట నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ వారు ప్రముఖ వారపత్రికలలో ప్రచురింపజేశారు. వారికి, ప్రచురించిన పత్రికల వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.© 2017,www.logili.com All Rights Reserved.