మట్టిని ప్రేమిస్తే మనిషినీ ప్రేమిస్తాం. మొవ్వ రామకృష్ణ ప్రకృతిలోని ప్రతి అణువునూ ప్రేమిస్తాడు. భావోద్వేగాలు బలంగా ఉన్నవాడు. ప్రేమించగలిగినవాడే ద్వేషించడానికీ అర్హుడు. తన యిష్టాయిష్టాల్ని బాణాల్లా వదులుతాడు రామకృష్ణ. రామకృష్ణకు ప్రతిదృశ్యమూ కవితామయమే. 'కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీశ్రీ మాటలకు ఉదాహప్రాయుడు. అనుక్షణం అనుభవ పరంపరలో సజీవంగా జ్వలిస్తూ ఉంటాడు. రామకృష్ణ మౌలికంగా రైతు. రైతు కడగండ్లను, కన్నీళ్లను తెలిసినవాడు. అందుకనే ఈ సంపుటికి 'నిప్పు రాజేసిన నీళ్ళు' అని పేరు పెట్టాడు. అతివృష్టి, అనావృష్టులతో నిరంతరం రైతు జీవితాన్ని దుర్భరం చేసే ప్రకృతి శాపాన్ని ఈ కవిత ఆవిష్కరిస్తుంది.
'గతాన్ని అనుభవాల గడ్డపారాతో గుద్దుతుంటే కాలమనే బలిపీఠం దద్దరిల్లింది కలికాలమనే ఉరుము ఉరిమి జీవితంలో 'జీవి' అనే మొక్కను నాశనం చేసింది. కన్నీళ్ళకు కరిగిన రాళ్ళే. నిప్పును రాజేసిన నీళ్ళు, కడగండ్ల వానకు తడిసి ముద్దైన తనువు నివురు కప్పిన నిప్పులా జ్వలిస్తూనే ఉంది'.
కష్టాల వాన రైతులో జ్వాలల్ని ఎగరేసిన రీతిని రూపంగా, మార్మికంగా ఆవిష్కరిస్తాడు. జీవిత సత్యాన్ని ఆవిష్కరించి మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాడు. లేతమొక్కల్ని పసిపాపలా ప్రేమించే కవి రామకృష్ణ.