అమ్మ, నాన్నల తోడూ లేని సమయంలో తుఫాను రేపిన అలజడులలో పూర్తిగా తడిసి గడ్డకట్టుకు పోయిన చిన్నతనపు చిరుజ్ఞాపకాల అనుభవాలను అక్షరాల వెల్లువగా కూర్చిన వాస్తవిక భయోత్పాతం ఈ 'తుఫాను రాత్రి'. ఆత్మకూరు రామకృష్ణ గారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని, చెదిరిపోని అనుభవాలను, అనుభూతులను చిన్న చిన్న అంశాలతో సహా ఉత్ప్రేక్షించి, తదనుభావాలను, అనుభూతులను పాఠకుడి మనసుపై కూడా అదేవిధంగా ముద్రింపబడేట్లు ఒక ప్రవాహోద్వేగ శైలిలో వివరించారు.
'తుఫాను' ను ఒక విశాలమైన కాన్వాసుపై, తన మౌలిక కాలిన చిత్రరచనను ఈ దీర్ఘకవితలో అక్షరబద్దంచేసి చూపారు. తుఫాను పట్ల పిల్లల, పెద్దల, చెట్లు, జంతువులతో పాటు చరాచర వస్తుసహితమైన సకల ప్రాకృతిక సంస్పందనల్నీ చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ, హృద్యంగా వివరించి వర్ణించారు. ప్రాకృతిక మానవీకరణకు పట్టం కట్టారు. స్థూలంగా ఇదీ 'తుఫాను రాత్రి' దీర్ఘకవిత.
- మాకినీడి సూర్యభాస్కర్
అమ్మ, నాన్నల తోడూ లేని సమయంలో తుఫాను రేపిన అలజడులలో పూర్తిగా తడిసి గడ్డకట్టుకు పోయిన చిన్నతనపు చిరుజ్ఞాపకాల అనుభవాలను అక్షరాల వెల్లువగా కూర్చిన వాస్తవిక భయోత్పాతం ఈ 'తుఫాను రాత్రి'. ఆత్మకూరు రామకృష్ణ గారి మనసులో ఎప్పటికీ చెరిగిపోని, చెదిరిపోని అనుభవాలను, అనుభూతులను చిన్న చిన్న అంశాలతో సహా ఉత్ప్రేక్షించి, తదనుభావాలను, అనుభూతులను పాఠకుడి మనసుపై కూడా అదేవిధంగా ముద్రింపబడేట్లు ఒక ప్రవాహోద్వేగ శైలిలో వివరించారు. 'తుఫాను' ను ఒక విశాలమైన కాన్వాసుపై, తన మౌలిక కాలిన చిత్రరచనను ఈ దీర్ఘకవితలో అక్షరబద్దంచేసి చూపారు. తుఫాను పట్ల పిల్లల, పెద్దల, చెట్లు, జంతువులతో పాటు చరాచర వస్తుసహితమైన సకల ప్రాకృతిక సంస్పందనల్నీ చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ, హృద్యంగా వివరించి వర్ణించారు. ప్రాకృతిక మానవీకరణకు పట్టం కట్టారు. స్థూలంగా ఇదీ 'తుఫాను రాత్రి' దీర్ఘకవిత. - మాకినీడి సూర్యభాస్కర్© 2017,www.logili.com All Rights Reserved.